Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే అనిపించుకున్నాడు. సాధారణంగా సినిమాల్లో హీరోలు పొగ తాగడం.. మద్యం సేవించడం.. వంటి చెడు అలవాట్లు కలిగి ఉన్నవారిగా కనిపిస్తుంటారు. సినిమా కోసం వారు అలా చేస్తుంటారు. కొందరికి నిజ జీవితంలోనూ అలాంటి అలవాట్లు ఉంటాయి. అయితే సినిమాల వరకు ఓకే.. కానీ నిజ జీవితంలో అలా చేయొద్దని చెబుతున్నాడు.. అల్లు అర్జున్. చెడు అలవాట్ల వల్ల హీరోలను చూసి వారి ఫ్యాన్స్ కూడా అలాగే వ్యసనాలకు బానిసలు అవుతారని.. కనుక వాటిని ఎంకరేజ్ చేయొద్దని అల్లు అర్జున్ చెబుతున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

అల్లు అర్జున్‌కు ఈ మధ్యనే ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తి కంపెనీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట. అల్లు అర్జున్ యాడ్స్ చేస్తే భారీగా డబ్బు ముట్టజెబుతామని చెప్పారట. కానీ అందుకు అల్లు అర్జున్ నో చెప్పారట. ఎంత డబ్బులు ఇచ్చినా చెడు అలవాట్లకు సంబంధించి ప్రోత్సహించేలా యాడ్స్ చేయబోనని అల్లు అర్జున్ తేల్చి చెప్పాడట. తాను అలాంటి యాడ్స్‌లో నటిస్తే తనను చూసి తన ఫ్యాన్స్ చెడు అలవాట్లను నేర్చుకుంటారని.. అది తనకు ఇష్టం లేదని.. పొగ తాగడం.. మద్యం సేవించడం వంటి యాడ్స్‌లో చేయనని.. అవి హానికరమని అల్లు అర్జున్ చెప్పాడు.
సినిమాలలో కథకు అనుగుణంగా పొగ తాగే సీన్లు, మద్యం సేవించే సీన్లు.. ఉంటాయి. కానీ అవి వేరే. నిజ జీవితంలో వాటిని పాటించొద్దు.. కనుకనే పొగాకు యాడ్స్‌కు ఒప్పుకోవడం లేదు.. అని అల్లు అర్జున్ తేల్చి చెప్పారట. దీంతో బన్నీ చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తన అభిమానుల పట్ల ఇంతటి శ్రద్ధ చూపిస్తుండడంతో వారు అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. తమ అల్లు అర్జున్.. అభిమాన హీరో.. నిజంగానే బంగారం.. అని కొనియాడుతున్నారు.
ఇక అల్లు అర్జున్ తాజాగా 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. తన బర్త్ డే వేడుకలను ఆయన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు గాను ఆయన సెర్బియా దేశానికి భార్య స్నేహారెడ్డి, పిలలతో కలిసి వెళ్లారు. ఇక త్వరలోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు.