ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. గత సినిమాల కంటే కూడా అత్యధిక వసూళ్లను అందుకుని మార్కెట్లో బన్నీ స్థాయిని కూడా అమాంతంగా పెంచేసింది.
తాజాగా చిత్ర బృందం సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అల్లు అర్జున్.. ‘ఆర్య నుంచి పుష్ప దాకా నా ప్రయాణంలో వెన్నంటి ఉండి నడిపించిన సుకుమార్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి, అక్కడ విజయం రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేసుకుంటున్నా’’ అన్నారు.
ఇక తన స్టాఫ్ గురించి కూడా మాట్లాడుతూ వారు లేనిదే తాను లేనని చెప్పాడు. ఫ్యామిలీతో కన్నా వీరితోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తానని అన్నాడు బన్నీ. ఇక తన ఆఫీస్ బాయ్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు అతను టిక్ టాక్ స్టార్. ఎప్పుడైతే టిక్ టాక్ మూతపడిందో అతని స్టార్‌డం పడిపోయిందని సరదాగా అన్నాడు. తర్వాతి సినిమాలో అతనికి ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు బన్నీ. ఇక సుకుమార్ యూనిట్‌లో బాగా కష్టపడి పనిచేసిన సెట్‌బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్‌కు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…