నేచురల్ స్టార్ నాని తాను నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కిరాణ కొట్టుకి సంబంధించి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని.. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ.. అంటూ నాని తన అభిప్రాయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. నాని చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
అయితే ఈ ‘కిరాణా కొట్టు’ కామెంట్స్‌పై నాని తొలిసారిగా స్పందించారు. తనకి కిరాణా కొట్టుకి కనెక్షన్ ఉందని చెప్పిన ఆయన తాను ఎవర్నీ కించపరిచి మాట్లాడలేదన్నారు. నేను చేసిన కామెంట్లపై స్పందించడానికి నేనేం పెద్ద ఇబ్బంది పడటం లేదు. నేను మాట్లాడింది కొంతే.. దాంట్లో చిన్న పదాన్ని పట్టుకుని దాన్ని తిప్పి తిప్పి కొట్టి.. ఆ పదానికి డిఫరెంట్ థంబ్ నెయిల్స్ పెట్టి.. ఆ వర్డ్‌ని తీసుకుని వెళ్లి వేరేవాళ్ల దగ్గర చెప్పి.. వాళ్ల రియాక్షన్ తీసుకుని వాళ్లతో నన్ను ఏదోటి అనిపించారు.
చాలామందికి అర్ధం కాని విషయం ఏంటంటే.. అమీర్ పేట ఇమేజ్ హాస్పిటల్ పక్కన ఉన్న కిరాణా షాపు లాంటి ఎస్టీడీ కెఫే మా నాన్నగారికి ఉండేది. హాస్పిటల్ లో ఉండే పేషెంట్స్ కోసం ఆ చిన్న షెటర్‌లో కేఫ్ పెట్టారు. నేను కాలేజ్ అయిన తరువాత వెళ్లి కౌంటర్‌లో కూర్చునే వాడిని. నాపై కామెంట్లు చేస్తున్నవాళ్లెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే.. కిరాణా కొట్టుతో నాకు కనెక్షన్ ఉంది. నేను అడిగింది ఏంటంటే.. అంతమందికి ఉద్యోగాలు లేకపోతే థియేటర్స్ వాళ్లు ఎలా బతుకుతారని, కానీ దానిని వేరేలా ప్రొజెక్ట్ చేశారని నాని పేర్కొన్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…