Alia Bhatt : సినీ సెలబ్రిటీలు అనేక సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటుంటారు. వారు ఏం చేసినా కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటుంది. ఈ క్రమంలోనే వారు ప్రమోట్ చేసే బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల విషయంలోనూ ఇప్పటి వరకు చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా నటి ఆలియాభట్ కూడా ఇలాగే వివాదంలో ఇరుక్కుపోయింది. గతంలో ఆమె చేసిన కామెంట్లను ఆసరాగా చేసుకుని కొందరు ఇప్పుడు ఆమెను తెగ ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
గతంలో ఆలియాభట్ ఒకసారి కపిల్ శర్మ షో అనే ఓ కామెడీ షోలో పాల్గొంది. అప్పట్లో ఆమె తాను అసలు చక్కెర తినను అని.. అది ఆరోగ్యానికి అత్యంత హానికరం అని కామెంట్ చేసింది. ఎవరూ చక్కెరను తినవద్దని.. అది అన్ని అనారోగ్య సమస్యలనే తెచ్చి పెడుతుందని ఆమె కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె పలు కూల్ డ్రింక్స్‌కు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. దీంతో నెటిజన్లకు చక్కని ఆయుధం దొరికినట్లు అయింది. ఆమె అన్న కామెంట్లనే సాక్ష్యాలుగా చూపిస్తూ వారు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఓ వైపు చక్కెర తినొద్దని చెప్పిన ఆలియా భట్.. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేయడం ఎందుకని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చక్కెర స్లో పాయిజన్ అన్న ఆలియాభట్.. ప్రజలకు విషం తీసుకోమని ఎలా చెబుతుందని అడుగుతున్నారు. అంటే డబ్బులు ఇస్తే విషం తినాలని కూడా ప్రమోట్ చేస్తారా.. ప్రజల ఆరోగ్యం అంటే మీకు లెక్కలేదా.. అని కడిగి పారేస్తున్నారు. దీంతో ఆలియా భట్‌పై ప్రస్తుతం ట్రోల్స్, విమర్శలు ఎక్కువవుతున్నాయి.
కాగా ఆలియా భట్ ఇటీవలే గంగూబాయ కతియవాడి సినిమాతో పలకరించింది. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీలోనూ సీత పాత్రలో అలరించింది. త్వరలో ఈమె కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంలో నటించనుంది. ఇక తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…