OTT : ప్రతి వారం వచ్చిందంటే చాలు.. ఓటీటీల్లో కొత్త మూవీలు ఏవి విడుదల అవుతాయా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో కన్నా ఓటీటీల్లో మూవీలను చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. అందులో భాగంగానే మేకర్స్ కూడా కాస్త ఎక్కువ రుసుము తీసుకుని మరీ తమ సినిమాలను ముందుగానే ఓటీటీల్లోకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. అవి ప్రేక్షకులను అలరించే సినిమాలు కావడం విశేషం. ఇక ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డె నటించిన బీస్ట్ మూవీ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానుంది. మే 11న సన్ నెక్ట్స్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. ఓ దశలో విజయ్ ఫ్యాన్స్ చెన్నైలో ఓ థియేటర్‌లో తెరను తగులబెట్టారు. దీంతో సినిమాకు ఏవిధమైన నెగెటివిటీ వచ్చిందో అర్థమైంది. అయితే ఓటీటీలో అయినా ఈ మూవీ అలరిస్తుందో.. లేదో.. చూడాలి.
ఇక దేశ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎట్టకేలకు ఓటీటీల్లోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాకిచ్చింది. ఈ మూవీని జీ5 ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ చేయనున్నారు. మే 13వ తేదీన ఈ యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
అలాగే ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో, గూగుల్ ప్లే మూవీస్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను చూడాలంటే పే పర్ వ్యూ పద్ధతిలో డబ్బులు చెల్లించాలి. ఈ సినిమా తెలుగు, హిందీలోనూ అందుబాటులోకి రానుంది.
ది సావేజ్ బ్యూటీ అనే ఇంగ్లిష్ డ్రామా మూవీని సైతం ఈ వారమే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో మే 12వ తేదీ నుంచి ఈ మూవీని చూడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…