Akkineni Amala : చాలాకాలం తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు తల్లిగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది అమల అక్కినేని. అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అమల నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అమల కూడా పాల్గొంటోంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. 2014 లో మనం చిత్రంలో డాన్స్ టీచర్ గా అతిథి పాత్రలో కనిపించిన అమల మరలా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అమల. శివ చిత్రంలో నాగార్జునకు భార్యగా నటించిన అమల నిజజీవితంలో కూడా నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిత్రాలకు దూరమై కుటుంబ బాధ్యతలను అంకితమైపోయింది. అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్త నాగార్జున బిజినెస్ లో సహాయం చేస్తూ సమయం గడుపుతుంది.
ఒకే ఒక జీవితం చిత్రంలో హీరో శర్వానంద్ తల్లిగా అమల కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకున్న సందర్భంగా అమల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా అమల మాట్లాడుతూ ఈ చిత్రంలో ఉన్న విధంగా టైం మిషన్ లోకి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని.. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను కౌగిలించుకొని ఒక్కసారిగా ఏడ్చేసిందని అమల చెప్పుకొచ్చారు.
ఇక నాగార్జున గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నా సక్సెస్ లో ఎప్పుడు భాగమై ఉంటారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని అడగ్గా.. మేము ఇంట్లో కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్ పై కూడానా.. వద్దు.. అంటూ నవ్వుతూ జవాబు ఇచ్చింది. అమల ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్న తన అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…