Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.
త్వరలోనే బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే మూవీకి కూడా సైన్ చేసింది. త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల భామ. అయితే ప్రస్తుతం రష్మిక రెమ్యూనరేషన్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. పుష్ప 2 కోసం పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.4 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.
అదేవిధంగా ఇక నుంచి చేసే ప్రతి సినిమాకు కూడా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీపం ఉండగానే.. ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రష్మిక బాగానే ఫాలో అవుతుందని నెటిజన్లు అంటున్నారు. పుష్ప విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 6 మిలియన్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు. రష్మిక నటించిన సీతారామం ఇటీవల విడుదల కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రష్మిక ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ తో వారసుడు, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లో నటించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…