Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కోవిడ్ రెండో దశ అనంతరం అనేక సినిమాలు వచ్చినా వాటిల్లో కొన్నే హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన మూవీల్లో అఖండ ఒకటి. దీంతో చాలా రోజుల తరువాత బాలయ్యకు హిట్ లభించగా.. టాలీవుడ్ ఇప్పుడు గంపెడు ఆశలతో ఎదురు చూస్తోంది. ఇక త్వరలోనే పెద్ద సినిమాలు మరిన్నింటిని ఉత్సాహంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే అఖండ మూవీలో నటించిన నితిన్ మెహతా ఇప్పుడు పాపులర్ అయ్యారు. ఆయన గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో నితిన్ మెహతా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నితిన్ మెహతా నిజానికి ఇండియన్ ఆర్మీలో 21 సంవత్సరాలు పాటు పనిచేశారు. అయితే ఆయన నటుడిగా పేరు తెచ్చుకోవాలకున్నారు. అందుకనే మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించడం కోసమే ఆయన ఆర్మీ జాబ్‌ను సైతం వదులుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక అఖండ మూవీలో నటించిన నితిన్ మెహతా ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. ఆయన అచ్చం త్రివిక్రమ్ శ్రీనివాస్‌లా ఉన్నారంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు పలు మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ మెహతా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆయనకు వరుసగా అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా సినిమాలలో మరిన్ని చాన్స్‌ల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…