Janhvi Kapoor : సినిమా సెలబ్రిటీలు అన్నాక తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వారు చేసే పనులతోపాటు వారు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, వారు ప్రవర్తించే తీరు కూడా.. వారు వార్తల్లో నిలిచేందుకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే హీరోయిన్లు ఎక్కువగా నెటిజన్ల చేతిలో విమర్శలకు గురవుతుంటారు. ఇక ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్, విమర్శలు ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు.
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకు ఒక్క హిట్ కూడా లేదు. నటిగా గుర్తింపు పొందినా హిట్ సినిమాలు తన ఖాతాలో లేవు. దీంతో ఈ అమ్మడు ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.
జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన విషయాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తుంటుంది. ఎక్కువగా ఈమె వెకేషన్ కు వెళ్తుంది. ఫొటోషూట్ లు చేస్తుంది. ఆయా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో తన గ్లామర్ ఫొటోలు యువతకు నిద్రలేకుండా చేస్తుంటాయి.
అయితే జాన్వీకపూర్‌ను నెటిజన్లు తాజాగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈమె తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక చోటుకు వెళ్లింది. అక్కడ ఫొటోగ్రాఫర్లు చేరి ఫొటోలకు పోజులు ఇవ్వమని అడిగారు. అయితే ఆమె ఫొటోలకు పోజులు ఇవ్వకుండా వెళ్లి కారులో కూర్చుంది. దీంతో ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌ను నెటిజన్లు విమర్శించడం మొదలు పెట్టారు.
ఫొటోలు తీసుకుంటామని అడిగితే పోజులు ఇవ్వకుండా యాటిట్యూట్ చూపిస్తుంది చూడు.. అంటూ నెటిజన్లు జాన్వీ కపూర్‌ను విమర్శిస్తున్నారు. దీంతో ఆమెపై ప్రస్తుతం ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…