MS Dhoni : భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. భారత జట్టుకు ఎంతగానో సేవలందించిన ధోనీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరై కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ సాక్షిని పెళ్లి చేసుకున్న ధోనీ కుమార్తె జీవాతో కలిసి ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుకు ధోనీ మెంటార్‌గా కూడా వ్యవహరించాడు.
అయితే ధోనీకి పెళ్లి కాక ముందు.. 2008-2009 సంవత్సరంలో నటి రాయ్ లక్ష్మీతో సంబంధం ఉందని, వారు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అందుకు ఊతం ఇస్తూ వారు ఐపీఎల్ సందర్భంగా పలు పార్టీలకు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. తన ఫ్రెండ్ సురేష్ రైనాతో కలిసి ధోనీ.. రాయ్ లక్ష్మీ ఇచ్చిన పార్టీలకు, ఆమె బర్త్‌డేలకు హాజరయ్యాడు. అయితే ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ.. కేవలం ఒక ఏడాది మాత్రమే వారు కలసి ఉన్నారు. తరువాత విడిపోయారు.
ఈ క్రమంలోనే ధోనీతో తనకు ఉన్న అనుబంధంపై రాయ్ లక్ష్మీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించింది. ధోనీ ఓ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని, అతన్ని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేందుకు వెనుకాడదని.. రాయ్ లక్ష్మీ పేర్కొంది. అయితే ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది..? ఎందుకు విడిపోయారు..? అన్న వివరాలను ఆమె చెప్పలేదు. కానీ ధోనీతో విడిపోయాక తన జీవితంపై ఒక మచ్చ పడిందని ఆమె తెలిపింది.
ధోనీ, నేను విడిపోయాం. అతను పెళ్లి చేసుకున్నాడు. నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. రేపు ఎప్పుడైనా నేను వివాహం చేసుకుని పిల్లల్ని కంటే ఆ తరువాత ధోనీ, తన మ్యాటర్ బయట పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. నా జీవితంపై అది మచ్చలా ఉంది.. అంటూ రాయ్ లక్ష్మీ సంచలన విషయాలను బయట పెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…