Aha Balakrishna : నందమూరి బాలకృష్ణ ఆహా యాప్‌లో రానున్న ఓ టాక్‌షోకు వ్యాఖ్యాతగా మారారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ టాక్ షోను ఆయన లాంచ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు ఆయనను మంచు మోహన్ బాబు, విష్ణులు కలిశారు. తన కుమారుడికి సపోర్ట్ ఇచ్చినందుకు మోహన్ బాబు.. బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత బాలకృష్ణ టాక్ షోను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆహా కోసం ఈ షో చేయడం ఆనందంగా ఉందన్నారు. అనేక జాతీయ, అంతర్జాయతీయ ఓటీటీలకు దీటుగా ఆహా కూడా ఎదగాలని అన్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఆహాలో బాలకృష్ణ టాక్ షో అనడంతో.. ఈ షోపై ఉన్న ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక ఈ షో లాంచ్ సందర్భంగా అనేక విషయాలపై బాలకృష్ణ మాట్లాడారు.
సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే పోటీ ఉంటుందన్నారు. పోటీ ఉండాలని.. అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అయితే అది కేవలం సినిమాలకు, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని బాలకృష్ణ అన్నారు. బావిలో కప్పల మాదిరిగా అక్కడే ఉండిపోవద్దని సూచించారు. కాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆయన ‘మా’ వివాదం నేపథ్యంలోనే ఈ విధంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. అయితే ‘మా’ లో నెలకొన్న వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…