Acidity home remedies : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన పేర్కొన్న సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులలో ఉండే లక్షణాలు పొట్ట ఉబ్బరం,గ్యాస్ వికారం వంటి వాటికీ తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నోటిలో వేసుకొని నమలవచ్చు. అలాగే రెండు కప్పుల నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని కూడా త్రాగవచ్చు. అదేవిధంగా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క అన్నవాహిక లో ఉండే యాసిడ్స్ ని సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
ఎసిడిటి వలన వచ్చే కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి వాటిని చాలా సమర్ధవంతంగా తరిమికొట్టే సామర్ధ్యం మజ్జిగకు ఉంది. ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసి గ్లాస్ మజ్జిగలో కలిపి త్రాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదనపు రుచి కోసం కొంచెం నల్ల మిరియాల పొడి, కొత్తిమీర కూడా మజ్జిగలో కలపవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలిన్ కడుపులో ఆమ్ల చికిత్సకు బాగా సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో రెండు టీ స్పూన్స్ ఆపిల్ సైడర్ లో వెనిగర్ కలిపి త్రాగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు త్రాగితే కడుపు నొప్పి గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…