Anushka : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించి కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని సినిమాలు ఇటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చి వారి హృదయాలలో మర్చిపోలేని స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చిత్రాలలో వేదం మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్, మంచు మనోజ్ లు హీరోలుగా నటించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.
ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, దీక్షాసేత్, అతిథి గౌతమ్ హీరోయిన్స్ గా నటించారు . అంతే కాకుండా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాల కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే యదార్థగాథలకు అనుగుణంగా పాత్రలను చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనుష్క వేశ్య పాత్రలో నటించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమాలో అనుష్క పాత్రతో పాటు అనుష్కని అంటిపెట్టుకునే తిరిగే మరో క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టరే అనుష్క స్నేహితురాలు కర్పూరం. ఎప్పుడూ అనుష్క పక్కనే ఉండే హిజ్రా కర్పూరం పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో బ్రహ్మానందంతో కర్పూరం చేసిన కామెడీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. అంతే కాకుండా కర్పూరం కాల్పుల్లో గాయపడినప్పుడు ఉండే ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఈ కర్పూరం పాత్రలో నటించింది ఎవరు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.
మొదటిగా కర్పూరం పాత్రను దర్శకుడు క్రిష్ చేయాలని అనుకున్నారట. కానీ క్రిష్ తల్లి ఆ పాత్రలో నటించవద్దని హెచ్చరించడం జరిగిందట. అయితే అదే సమయంలో అనుష్క తన మేకప్ ఆర్టిస్ట్ నిక్కి ఫోటోలను క్రిష్ కు చూపించటం జరిగిందట. ఫొటోస్ తోపాటు కజ్ రారే పాటకు నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా క్రిష్ కు చూపించారట అనుష్క. ఆ వీడియో చూసి కర్పూరం పాత్రకు నిక్కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని క్రిష్ వెంటనే ఓకే చేయడం జరిగిందట. ఆ విధంగా నిక్కి వేదం చిత్రంలో కర్పూరం పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…