Acharya Movie : టాలీవుడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తరువాత అంతటి స్థాయిని పొందిన దర్శకుల్లో కొరటాల ఒకరు. రాజమౌళిలాగే ఈయనకు కూడా ఇప్పటి వరకు ఫ్లాప్స్ లేవు. దీంతో ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మొదటిసారిగా కొరటాల అంచనాలు తప్పాయి. ఆచార్య ఆయనకు పీడకలనే మిగిల్చింది. దీంతోపాటు ఆయన ఈ మూవీ బిజినెస్ వ్యవహారాల్లోనూ వేలు పెట్టారు. దీంతో ఆర్థిక సమస్యలూ తప్పడం లేదు. అయితే ఎన్నో హిట్స్ ఇచ్చిన కొరటాలకు ఆచార్య ఎక్కడ తేడా కొట్టింది.. అన్న విషయంపై రోజూ చర్చ జరుగుతూనే ఉంది. ఆచార్య ఫెయిల్యూర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ కథలో అనేక మార్పులు చేయడం వల్లే సినిమా డిజాస్టర్ అయిందని తెలుస్తోంది.
ఆచార్య మూవీ వాస్తవానికి షూటింగ్‌కే 2 ఏళ్లకు పైగానే పట్టింది. కరోనా వల్ల ఆలస్యం అయింది. కానీ రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. అలాగే కాజల్ అగర్వాల్ సీన్లను పూర్తిగా తొలగించారు. చివరి నిమిషం వరకు కూడా కథలో అనేక మార్పులు చేస్తూ వచ్చారు. రీషూట్స్ కూడా చేశారు. దీంతో మొదటికే మోసం వచ్చింది. అభ్యుదయ భావాలు కలిగిన కథతో సినిమాలు తీస్తే 1990లలో శతదినోత్సవాలు జరుపుకునేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటున్నారన్న కనీస విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో కథను పూర్తిగా మార్చేసి నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో ఆచార్యను తెరకెక్కించారు. ఫలితంగా మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. మేకర్స్ కు రూ.84 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది.
అయితే వాస్తవానికి ఆచార్య ఒరిజినల్ స్టోరీ వేరే ఉందని సమాచారం. ఇందులో చిరంజీవి నక్సలైట్‌గా కాకుండా ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాల్సి ఉందట. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిగా ఆయన ధర్మస్థలిని ఎలా కాపాడుతారు.. అని కొరటాల లైన్ రాసుకున్నారట. ఇక చరణ్‌ను కూడా ఇందులో చూపించాలని అనుకున్నారట. చిరంజీవి చిన్న వయస్సు పాత్రకు చరణ్‌ను అనుకున్నారట. కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. కథను పూర్తిగా మార్చేశారు. చరణ్ పాత్రను బలవంతంగా జోడించినట్లు చేశారు. అలాగే చిరంజీవి పాత్రను నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో మార్చేశారు. ఇక కాజల్ అగర్వాల్ పాత్రను అయితే పూర్తిగా లేపేశారు.
కథలో చివరి నిమిషం వరకు ఇలా అనేక మార్పులు చేయడం వల్లే ఆచార్య ఫ్లాప్ అయిందని అంటున్నారు. ముందుగా అనుకున్న స్టోరీతోనే మూవీని తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. ఆచార్య ఘన విజయం సాధించి ఉండేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అంతా అయిపోయింది కనుక ఏమీ చేయలేం. ఇకనైనా అటు చిరంజీవి, ఇటు కొరటాల ఆచార్య గుణపాఠంతో సినిమాలు చేస్తే హిట్ కొట్టే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆచార్యకు మించిన డిజాస్టర్లను పొందుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…