Nithya Menen : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల్లో దేన్ని నమ్మాలో.. దేన్ని నమ్మకూడదో అసలు తెలియడం లేదు. అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో చాలా వరకు నిజమే అవుతున్నాయి. కానీ ఆ వార్తలను సదరు సెలబ్రిటీలు ఖండించడం లేదు. దీంతో అవి నిజమా.. కాదా.. అన్న అనుమానం నెటిజన్లలో నెలకొంటోంది. అయితే ఈ వార్తలను పక్కన పెడితే కొందరు కావాలనే ఫేక్ వార్తలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి వార్త ఒకటి నెట్‌లో హల్ చల్ చేసింది. అదే నిత్య మీనన్ పెళ్లి విషయం.
మళయాళ ముద్దుగుమ్మ నిత్య మీనన్ త్వరలోనే అదే రాష్ట్రానికి చెందిన ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఆమె, అతను గత కొంతకాలంగా లవ్ ట్రాక్‌ను నడిపిస్తున్నారని, పెద్దలతోనూ ఈ విషయాన్ని చెప్పారని.. ఇక పెళ్లి ఒక్కటే తరువాయి అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిత్య మీనన్ స్వయంగా స్పందించింది. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని.. ఆ వార్తలను నమ్మవద్దని.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోబోవడం లేదని నిత్య మీనన్ తెలియజేసింది. అసలు తన దృష్టి ప్రస్తుతం సినిమాలపైనే ఉందని, పెళ్లిపై లేదని.. ఆ సందర్భం వస్తే తప్పక తెలియజేస్తానని.. ఆమె స్పష్టం చేసింది. దీంతో ఆమె పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టమయ్యాయి. ఇక నిత్య మీనన్ చివరిసారిగా భీమ్లా నాయక్ చిత్రంలో నటించగా.. ప్రస్తుతం ఈమెకు తెలుగులో ఆఫర్లు లేవు. కానీ మళయాళ చిత్రాల్లో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…