Acharya Movie : దాదాపు మూడేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించగా.. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజా హెగ్డె గ్లామర్ తోడు కావడంతో సినిమా మంచి హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ తొలి షో నుండే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగా తగ్గాయి.
ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు రూ.132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలోకి దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆదివారం.. రూ.4.07 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక నాలుగో రోజు.. ఈ సినిమాకు రూ. 53 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా రీచ్ కాదని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఆచార్య మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కాకముందే ఆచార్య ఓటీటీలలో రానుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. పూజా హెగ్డె, తనికెళ్ల భరణి, అజయ్, శత్రు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఆచార్యకు సంగీతం అందించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…