Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారూఖ్ ఖాన్ ఒకరు. అతడిని ముద్దుగా బాలీవుడ్ బాద్ షా అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ వయస్సులోనూ షారూఖ్ ఖాన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు.అయితే తాజాగా ఆయన ఇంటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని బాంద్రాలో షారూఖ్ ఖాన్‌కి పెద్ద భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.
ఆ ఇంటికి మన్నత్ అనే పేరుని షారూఖ్ పెట్టుకోగా.. ఆయన బర్త్ డే నాడు అభిమానులు మన్నత్‌కి భారీగా తరలి వస్తుంటారు. ఆ సమయంలో మన్నత్ దీపపు కాంతులతో మెరిసిపోతుంటుంది. అయితే మన్నత్ నేమ్ ప్లేట్‌ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో మన్నత్ నేమ్ ప్లేట్‌ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆ నేమ్ ప్లేట్ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈనేమ్ ప్లేట్‌ని షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేయగా, దీనికి రూ.25 లక్షల వరకు ఖర్చయిందట.
యూరప్ నుండి దిగుమతి చేసిన ప్రత్యేక రాయితో మన్నత్ నేమ్ ప్లేట్‌ని రూపొందించినట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ దగ్గర చాలా మంది పలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండగా.. ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…