బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఇవి చోటుచేసుకుంటాయట. ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సినిమాలో కూడా మనం ఎన్నో చూశాం. అయితే ఇవి ఉగాది తర్వాత చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2023 నుండి 2024 మధ్యలో సమాజంలో అనేక విలువలు దిగజారి పోతాయని చెప్పారు వీరబ్రహ్మం గారు. ముఖ్యంగా వివాహ కట్టుబాట్లని మర్చిపోయి ఇతరల వ్యామోహంలో పడిపోతారట. డబ్బు కోసం మనుషులు చావడానికి, చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారట.
అదే విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుండి రాళ్లు పడి ఇబ్బందులు కలుగుతాయట. అనేక రకాల వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2025- 26 మధ్యలో భారత దేశంలో అనుకోని సంఘటనలేవో జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందర్నీ సత్ప్రవర్తన వైపు వెళ్లేలా చేస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.
ప్రపంచ జనాభా 2065 నాటికి పడిపోతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. 2024 నాటికి కొత్త నక్షత్రం ఆకాశంలో ఉద్భవిస్తుంది. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు వేస్తాయి. నెత్తురు కక్కుతూ అనారోగ్య సమస్యలతో జనాలు చనిపోతారు. జంతువులు కూడా అలాగే చచ్చిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఉంది. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన ఉన్నవాళ్లు భయంకరమైన కష్టాలు పడి మరణిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.
అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మనుషుల్ని చంపుతాయని కూడా చెప్పారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ కారణంగా గొడవ పడి చనిపోతారట. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయని కూడా కాలజ్ఞానంలో చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనపడకుండా మాయమైపోతుందని కూడా చెప్పారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇవి జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆయన చెప్పిన చాలా విషయాలు జరగడం మనం విన్నాము. చూశాము.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…