Tourist Places In Munnar : మున్నార్.. కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. పచ్చని ప్రకృతి అందాలతో ఎప్పుడూ అలరారుతూ ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండ చరియలు.. పర్యాటకులకు మధురమైన అనుభూతులను కలిగిస్తుంటాయి. కేరళ రాజధాని కొచ్చికి 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. అయితే పర్యాటక ప్రేమికులు మున్నార్‌లో చూడదగిన అందాలు, ఆస్వాదించదగిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మున్నార్‌ను సందర్శించే పర్యాటకులు చాలా మంది అక్కడి మౌంటేన్ బైకింగ్‌ను అనుభూతి చెందుతారు. పచ్చని పర్వతాలపై బైకింగ్ చేస్తే వచ్చే కిక్కే వేరేగా ఉంటుంది. సాహిసికులు ఎక్కువగా మున్నార్‌లో మౌంటేన్ బైకింగ్ అడ్వెంచర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కనుక మీరు కూడా ఎప్పుడైనా మున్నార్ వెళితే.. తప్పక ఈ సాహసాన్ని ట్రై చేయండి. మున్నార్‌లోని ఎరవికులం నేషనల్ పార్క్ 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా ఇక్కడి వైల్డ్ లైఫ్ సఫారి కోసం ఎంతో మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. అనేక రకాల జీవవైవిధ్యం ఉన్న ప్రాణులకు ఈ పార్కు నిలయంగా మారింది. మున్నార్ లో ఉన్న చూడదగిన ప్రదేశాల్లో ఇదొకటి.
కుందల సరస్సులో ఈ రైడ్ పర్యాటకులకు అందుబాటులో ఉంది. పచ్చని కొండచరియలు, దట్టమైన చెట్లతో ఉన్న అరణ్యం మధ్యలో అత్యంత చీకట్లో ఈ రైడ్ సాగుతుంది. సాహసికులు ఇక్కడ గొప్ప అనుభూతి చెందవచ్చు. పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో గడిపితే అన్ని ఆందోళనలు పోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే మున్నార్ లో పర్యాటకులకు ఆయుర్వేద స్పాలు స్వాగతం పలుకుతుంటాయి. కేరళకు చెందిన సంప్రదాయ నృత్యాల్లో కథకళి ఎంతో పేరుగాంచింది. నైపుణ్యం ఉన్న కళాకారులు ప్రదర్శించే నృత్యాన్ని కచ్చితంగా పర్యాటకులు చూడాల్సిందే. వారి లైవ్ ప్రదర్శనలు పర్యాటకుల కళ్లను కట్టి పడేస్తాయి.
మున్నార్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చాలా ఫేమస్సే. ఇక్కడికి వచ్చే అనేక మంది పర్యాటకులు పచ్చని కొండచరియలపైకి ట్రెక్కింగ్ చేస్తారు. సాహసంతో కూడిన యాత్రలు చేస్తారు. కార్మెలగిరిలో ఉన్న ఏనుగుల పార్క్ మున్నార్ దగ్గర చాలా ప్రసిద్ధి గాంచింది. దట్టమైన అడవుల్లో ఏనుగులను చూస్తూ విహరించవచ్చు. మున్నార్‌లోని కొలుక్కుమలై టీ ప్లాంటేషన్ చక్కని ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంటుంది. ఇక్కడి కొండచరియలపై ఉండే తేయాకు తోటలు పర్యాటకుల చూపును తిప్పుకోనీయకుండా చేస్తాయి. మున్నార్ లో టీ మ్యూజియం కూడా ఉంది. 2005 లో దీన్ని ప్రారంభించారు. ఇందులో టీ తయారీ గురించి పర్యాటకులు తెలుసుకోవచ్చు. అలాగే పలు భిన్నమైన రకాలకు చెందిన టీ రుచులను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…