lifestyle

Longer Life : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. 100 ఏళ్ల‌కు పైగా జీవించ‌వ‌చ్చు..!

Longer Life : మ‌నిషి 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌డ‌మంటే.. ప్ర‌స్తుత త‌రుణంలో అది కొంత క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎప్పుడు ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌స్తుందో అర్థం కావ‌డం లేదు. దీనికి తోడు అన్నీ కాలుష్య‌మ‌యం అయిపోయాయి. కెమిక‌ల్స్‌తో పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటున్నాం. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌స్తుతం 60 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కు ఎవ‌రైనా జీవిస్తేనే గొప్ప విష‌యం అయిపోయింది. అయితే 100 ఏళ్ల పైబ‌డి జీవించాలంటే ఏం చేయాలి ? అంటే.. అందుకు ప్ర‌పంచంలో ఈ 5 దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు పాటించే జీవన విధానాన్ని పాటించాలి. దాంతో 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చ‌ట‌.

ఇట‌లీలోని సార్డినియా, జ‌పాన్‌లోని ది ఐల్యాండ్స్ ఆఫ్ ఒకిన‌వ‌, కాలిఫోర్నియాలోని లొమా లిండా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్‌లోని ఇక‌రియా ప్రాంతాల‌ను బ్లూ జోన్స్ అని వ్య‌వ‌హరిస్తారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్ర‌జ‌లు సుమారుగా 100 ఏళ్ల పైబ‌డే జీవిస్తున్నార‌ట‌. అందుకు కార‌ణం ఈ ప్రాంతాల్లో ఉన్న వారు కామ‌న్‌గా పాటించే జీవ‌న విధానం ఒక‌టుంది. దాంతోనే వారు అంత ఎక్కువ కాలం జీవించ‌గలుగుతున్నార‌ట‌. మ‌రి ఆ ప్రాంత‌వాసులు పాటించే ఆ లైఫ్ స్టైల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Longer Life

ఏ వ్య‌క్తి అయినా 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ స‌భ్యులు, స‌మాజంతో చ‌క్క‌ని అనుబంధం క‌లిగి ఉండాలి. ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయరాదు. కానీ రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌ల్ని ఎప్పుడూ య‌వ్వ‌నంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయ‌వు. అయితే రెడ్‌వైన్‌ను మితంగానే తాగాలి. మాంసాహారం మానేయాలి. అవును, మీరు మాంసాహార ప్రియులు అయినా స‌రే.. ఆ ఆహారాన్ని తీసుకోవడం మానేయాల్సిందే. ఎందుకంటే శాకాహార భోజ‌నం తినేవారు మాత్ర‌మే 100 ఏళ్ల‌కు పైబ‌డి బ‌తుకుతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే పైన చెప్పిన ఆ 5 ప్రాంతాల వాసులు కామ‌న్‌గా, ఎక్కువ‌గా తినేది శాకాహార‌మే. క‌నుక ఆ ఆహారాన్ని తీసుకుంటే 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చు.

నిత్యం వ్యాయామం చేయాలి. క‌ఠిన‌త‌ర వ్యాయామం అవ‌స‌రం లేదు. సాధార‌ణ వ్యాయామం అయినా స‌రే.. రోజూ చేయాలి. రోజూ క‌చ్చితంగా 8 గంట‌లు నిద్రించాలి. చాలా త్వ‌ర‌గా ప‌డుకుని త్వ‌ర‌గా నిద్ర లేవాలి. ఈ జీవ‌న‌శైలి పాటిస్తే ఎవ‌రైనా 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM