Ghost Signs And Symptoms : దెయ్యం పేరు చెప్పగానే భయపడే వారు చాలా మందే ఉంటారు. దెయ్యం గురించి మాట్లాడుకుంటే చాలు.. ప్యాంట్లు తడుపుకునే వారు కూడా చాలా మందే ఉంటారు. ఇక అలాంటి వారు హార్రర్ సినిమాలు చూడడం అసంభవం అని చెప్పవచ్చు. చాలా తక్కువ మందికి మాత్రమే దెయ్యాలు, భూతాలు అంటే భయం ఉండదు. సరే వీరి సంగతి పక్కన పెడితే.. అసలు నిజంగా దెయ్యాలు ఉంటాయా ? ఉంటే.. అవి మన దగ్గరకే వస్తే.. మన చుట్టూ తిరుగుతుంటే.. ఎలాంటి చిహ్నాలు, సూచనలు మనకు కనిపిస్తాయి ? ఎప్పుడైనా అలాంటి సూచనల గురించి మీరు విన్నారా ? వినలేదా..! అయితే.. ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు దెయ్యం అంటూ మన దగ్గరే ఉంటే.. మనకు ఎలాంటి చిహ్నాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దెయ్యం మన దగ్గరే ఉందని చెప్పడానికి ప్రధాన చిహ్నం.. చిన్నపాటి శబ్దాలు.. వాటిని వినగలిగితే దెయ్యం మన దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వింతైన చిన్న, చిన్న శబ్దాలు వస్తుంటే.. వాటిని ఎవరైనా వింటే.. అప్పుడు దెయ్యం ఉన్నట్లు భావించాలి. దెయ్యాలు ఇంట్లో ఉంటే.. కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులు చిత్రంగా ప్రవర్తిస్తుంటాయట. అలాంటి సూచనలు కనిపిస్తే దెయ్యం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉండే కుర్చీలు, టేబుల్స్, తాళం చెవులు.. తదితర వస్తువులు మీరు ఉంచిన చోట కాకుండా వేరే చోట కనిపిస్తున్నాయా ? ఇతరులెవరూ వాటిని కనీసం టచ్ కూడా చేయడం లేదా ? అయితే అది నిజంగా దెయ్యాల పనే.
మారిన్ హాంకాక్ అనే ఓ దెయ్యాల స్పెషలిస్టు చెబుతున్న ప్రకారం.. అర్థరాత్రి 3 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు దెయ్యాల పవర్ ఎక్కువగా ఉంటుందట. ఆ సమయంలో గనక మీకు నిత్యం మెళకువ వస్తుంటే.. అది దెయ్యాల పనే అని గ్రహించాలట. ఇది కూడా మీ దగ్గర దెయ్యం ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం. దెయ్యాలు నివాసంలో ఉంటే.. అందులో ఉండే వారి శరీరంపై రక్కినట్టు గాయాలు అవుతాయట. రాత్రి పూట అయ్యే ఈ గాయాలు తెల్లవారు జామున లేచి చూస్తే కనిపిస్తాయి. కానీ ఆ గాయాలు ఎలా అయ్యాయో తెలియదట.
పీడకలలు బాగా వస్తుంటే ఇంట్లో దెయ్యం ఉన్నట్లు భావించాలట. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ తదితర వస్తువులు డిస్టర్బెన్స్‌ను ఎదుర్కొంటే దెయ్యం ఉన్నట్లు భావించాలట. దెయ్యం ఉంటే ఆ నీడలు బాగా కనిపిస్తాయట. కానీ చూస్తే మనుషులెవరూ ఉండరు. ఇది దెయ్యం ఉందనడానికి నిదర్శనం. గదిలో ఉష్ణోగ్రత దానికదే ఇష్టం వచ్చినట్లు మారుతుంటే దెయ్యం ఉందని భావించాలట. దెయ్యాల స్పెషలిస్టు మారిన్ హాంకాక్ చెబుతున్న ప్రకారం.. ఇంట్లో దెయ్యం ఉంటే రాత్రి పూట గడియారంలో టైము 11:11 అయినప్పుడు మీరు దాని వంక ఆటోమేటిక్‌గా చూస్తారట.
మిమ్మల్ని ఎవరో చూస్తున్నట్లు, మీతో మాట్లాడాలని వారు అనుకుంటున్నట్లు మీకు భావన కలిగినా.. అది దెయ్యం ఉందనడానికి బలమైన చిహ్నమట. దెయ్యాలు తాము మాట్లాడాలనుకునే వారిని దగ్గరగా వచ్చి చిన్నగా పిలుస్తాయట. ఎవరైనా మిమ్మల్ని పిలిచినట్లు చిన్నగా శబ్దం వస్తే అది దెయ్యం పనే. మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో నుంచి అద్భుతమైన సువాసన వస్తుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోతే అది కూడా దెయ్యం ఉందనడానికి నిదర్శనమట.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…