Men Vs Women Brain : మన శరీరానికి ఉండే వయస్సు మాత్రమే కాకుండా మన ఆరోగ్య స్థితి, వ్యాధులు, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుంటే మన బయోలాజికల్ ఏజ్ కూడా ఒకటి ఉంటుంది తెలుసు కదా. అయితే ఇదే కాదు, ఇప్పుడు మన మెదడుకు కూడా ఏజ్ ఉంటుందట. అంతేకాదు, మెదడు విషయంలో పురుషుల కన్నా స్త్రీల మెదడే యవ్వనంగా ఉంటుందట. సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
అమెరికాకు చెందిన పలువురు సైంటిస్టులు ఈ మధ్యే 121 మంది స్త్రీలు, 84 మంది పురుషులపై అధ్యయనం చేశారు. వారి మెదడు మెటబాలిజం, మెదడుకు జరుగుతున్న ఆక్సిజన్ సరఫరా, మెదడు గ్లూకోజ్ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. దీంతోపాటు వారికి కొన్ని పజిల్స్ పెట్టారు. చివరకు సైంటిస్టులు ఏం తేల్చారంటే.. పురుషుల కన్నా స్త్రీల మెదడు షార్ప్‌గా ఉంటుందట. అలాగే స్త్రీ మెదడే పురుషుల మెదడు కన్నా యవ్వనంగా ఉంటుందట. అంటే స్త్రీల అసలు వయస్సు కన్నా వారి మెదడు వయస్సు 3.8 ఏళ్లు తక్కువగా ఉంటుందట. ఉదాహరణకు స్త్రీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుంటే వారి మెదడు వయస్సు 26.2 ఏళ్లే అన్నమాట.
అలాగే పురుషుల అస్సలు వయస్సు కన్నా వారి మెదడు వయస్సు 2.4 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందట. ఉదాహరణకు పురుషుడి వయస్సు 30 ఏళ్లు అనుకుంటే అతని మెదడు వయస్సు 32.4 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అందువల్లే సాధారణంగా వయస్సు మీద పడిన కొద్దీ మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతోపాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు పురుషులకే ఎక్కువగా వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్త్రీలకు వయస్సు మీద పడినప్పటికీ వారి మెదడు వయస్సు తక్కువగా ఉంటుంది కనుక వారికి జ్ఞాపకశక్తి, మెంటల్ అలర్ట్‌నెస్ ఎక్కువగా ఉంటాయని, వారి మైండ్ షార్ప్‌గా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ అధ్యయనానికి చెందిన వివరాలను అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…