Blood Clots : మన శరీరంలో ఉండే రక్తం గడ్డలు కడితే అవి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి ఆ తరువాత హార్ట్ ఎటాక్‌ను తెచ్చి పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఇక ఏదో ఒక సమయంలో సమస్య తీవ్రతరమై హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే అంత వరకు రాకుండా ఉండాలంటే.. కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో రక్తం గడ్డ కట్టకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో ఇతర గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
విటమిన్ డి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా మాత్రమే కాకుండా పుట్ట గొడుగులు, చీజ్, పాలు, కోడిగుడ్లు, చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు, అవకాడోలు, వాల్‌నట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు.
హైబీపీ ఉన్నవారికి వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే పరగడుపునే తింటుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. అల్లం రసం, అశ్వగంధ చూర్ణం, ఉల్లిపాయలు తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నా రక్తం గడ్డ కట్టకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…