Urine Smell : ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారి మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఎక్కువగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లే కారణం అయి ఉంటాయి. ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగని వారి మూత్రం కూడా వాసన వస్తుంది.
ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. సాధారణంగా ఇది వంశ పారంపర్యంగా వస్తుంటుంది.
నిత్యం తగినంత నీటిని తాగకపోయినా, డయాబెటిస్ ఉన్నా, కిడ్నీలలో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలు, లివర్ వ్యాధులు ఉన్నా.. మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఎవరైనా సరే.. మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చే మందులను కచ్చితంగా వాడాలి. దీంతో మూత్రాశయ సమస్యలు, మూత్రం దుర్వాసన రాకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…