Coriander Leaves Juice : సాధారణంగా మనలో అధిక శాతం మంది కొత్తిమీర ఆకులను నిత్యం పలు కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో వేసే ఈ ఆకులను కొందరు తింటారు కానీ.. కొందరు వాటిని తినేందుకు అంత ఆసక్తి చూపించరు. నిజానికి కొత్తిమీర ఆకులను పారేయకూడదు. వాటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం కొత్తిమీర ఆకుల రసాన్ని తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో శరీర కణజాలం రక్షింపబడుతుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. వాపులు కూడా తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్న వారు కొత్తిమీర ఆకుల రసాన్ని నిత్యం తాగితే వారి షుగర్ లెవల్స్ తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగుతుంటే ఆయా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరిగి జీవక్రియలు సరిగ్గా నిర్వహింపబడతాయి. గుండె జబ్బులు ఉన్నవారు ఈ రసాన్ని తాగితే భవిష్యత్తులో మళ్లీ ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే హైబీపీ తగ్గుతుంది.
అజీర్ణం ఉన్నవారు, ఫుడ్ పాయిజనింగ్ అయినవారు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు, చర్మంపై దద్దుర్లు, గాయాలు అయినవారు కొత్తిమీర ఆకుల రసం తాగితే ఫలితం ఉంటుంది. కొత్తిమీర ఆకుల రసం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కంటి సమస్యలు పోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…