Moringa Leaves Juice : ప్రస్తుత తరుణంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం ప్రధాన కారణం. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే ఆహారం కూడా తీసుకుంటారు. కొందరు జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తారు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మునగాకుల రసం బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మునగాకులు చాలామందికి తెలుసు కానీ అవి బరువును తగ్గిస్తాయని చాలామందికి తెలియదు. బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నవారు మునగాకుల రసాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీ డైట్ లో మునగాకుల రసాన్ని చేర్చుకుంటే అనేక లాభాలు ఉంటాయి. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. మునగాకులో ప్రోటీన్లు, ఫైబర్, క్లోరోజెనిక్ యాసిడ్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మునగాకుల రసాన్ని తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీ లభిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక మీ పొట్టను చాలా సమయం పాటు నిండుగా ఉన్నట్టు చేస్తుంది. అందువల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
మునగాకుల రసాన్ని తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. జీవక్రియలు వేగవంతం అవుతాయి. దీంతో బరువు తగ్గడం చాలా తేలిక అవుతుంది. మునగాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో కూడా మనకు సహాయపడతాయి. మునగాకుల రసాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వాపులు. నొప్పులు తగ్గుతాయి. బిపి అదుపులోకి వస్తుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది, కాంతివంతంగా మారుతుంది. ఇక మునగాకుల రసాన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందు మునగ ఆకులను కడగాలి, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి, తర్వాత దాన్నుంచి రసం తీయాలి, ఆ రసాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు. అందులో కావాలంటే నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇలా మునగాకుల రసాన్ని తాగితే అధిక బరువు తగ్గుతారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…