Tea Masala : టీ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేసవిలో కూడా టీ ఎక్కువగా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చల్లని వాతావరణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్పవచ్చు. చల్లని వాతావరణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో టీ తాగడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కొందరు మార్కెట్‌లో లభించే మసాలా టీ తెచ్చుకుని టీ తయారు చేసి తాగుతారు. అయితే కొందరు దీన్ని ఇంట్లోనే తయారు చేస్తారు. కాస్త శ్రమించాలే కానీ మసాలా పొడిని మనమే ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసి వాడవచ్చు. ఇక చాయ్ మసాలా పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో టీ మసాలా చేయడానికి 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలు, అల్లం బదులుగా పొడి అల్లం (సగం గిన్నె), పచ్చి యాలకులు (కనీసం 8 నుండి 10), జాజికాయ పొడి (2 చిటికెలు), ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, సగం టేబుల్ స్పూన్ లవంగాలు, సగం టీస్పూన్ సోంపు అవసరం అవుతాయి.
ముందుగా ఎండు అల్లం ముక్కలను దంచి గ్రైండర్‌లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ను కొద్దిగా వేడి చేసి, అందులో మొత్తం మసాలా దినుసులను పొడిగా వేయించాలి. సువాసన రావడం ప్రారంభించినప్పుడు, ఒక ప్లేట్‌లో మసాలా దినుసులను తీసి, కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎండు అల్లం పొడిలో మసాలా దినుసులను వేసి జాజికాయ పొడిని కూడా వేయాలి. ఇలా చేస్తే టీ మసాలా రెడీ అవుతుంది. దీన్ని మీరు టీ తయారు చేసేటప్పుడు నీటిలో వేసి కాస్త మరిగించి అనంతరం టీ తయారు చేసి తాగితే చాలు. టీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీని సేవించడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ కలుగుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…