Bhringraj Leaves For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమైన జీవనశైలి, కాలుష్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మందులను ఎక్కువగా వాడడం.. వంటి అనేక కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం అన్నది అందరికీ నిద్ర పట్టకుండా చేస్తోంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. ఇవి చాలా ఖరీదు కలవి అయి ఉంటాయి. వీటిని వాడడం వల్ల దీర్ఘకాలంలో మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
ఇక జుట్టు సమస్యలను తగ్గించడంలో మనకు భృంగరాజ్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మొక్క మనకు చుట్టూ పరిసరాల్లో లభిస్తుంది. దీని ఆకులను సేకరించి ఉపయోగించవచ్చు. లేదా మార్కెట్‌లో మనకు భృంగరాజ్ ఆకుల పొడి లభిస్తుంది. దీన్ని అయినా వాడుకోవచ్చు. భృంగరాజ్ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని గ్లోవ్స్ సహాయంతో జుట్టుకు బాగా అప్లై చేయాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. వారంలో ఇలా కనీసం 2 సార్లు చేయాలి.
ఈ విధంగా భృంగరాజ్ మొక్క ఆకులతో చిట్కాను పాటిస్తే మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఒత్తుగా మారి దృఢంగా ఉంటుంది. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మీ జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. భృంగరాజ్ ఆకులను జుట్టు సమస్యలను తగ్గించడంలో ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. అందువల్ల మీకు జుట్టు సమస్యల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…