Vastu Tips : చాలా మంది డబ్బులు సంపాదించలేకపోతుంటారు. ఇక కొందరు డబ్బులను సంపాదిస్తారు కానీ అనవసరంగా వృథాగా డబ్బు ఖర్చవుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కింద చెప్పిన పరిహారాలను పాటించాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఫలితంగా సంపద వృద్ధి చెందుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పురాణాలు చెబుతున్న ప్రకారం తాబేలును విష్ణుమూర్తికి ప్రతీకంగా భావిస్తారు. ఆయన దశావతారాల్లో కూర్మావతారం కూడా ఉంది. అలాగే ఫెంగ్ షుయ్ ప్రకారం చూసినా తాబేలు ఎంతో మంచి చేస్తుంది. అందువల్ల మీరు మీ ఇంట్లో వెండి లేదా బంగారు పూత పూసిన తాబేలును పెట్టుకోండి. దీన్ని మీ లాకర్‌లో లేదా ఇంట్లో బీరువాలో, ఉత్తర దిశలో పెట్టుకోవచ్చు. ఇది సంపదను ఆకర్షిస్తుంది. డబ్బు సమస్యలు పోయేలా చేస్తుంది.
ఇక ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇంట్లో ఉండడం ఎంతో మంచిది. దీన్ని శుభ ప్రదంగా భావిస్తారు. ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శ్రేయస్సు నెలకొంటుంది. దీన్ని గిఫ్ట్ గా పొంది మాత్రమే ఇంట్లో పెట్టాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనం కొని అయినా దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల సంపద ఆకర్షించబడుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నెల నెలా చక్కని ఆదాయం పొందుతారు. డబ్బు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది.
ఇక ఫెంగ్ షుయ్ ప్రకారం మీ ఇంట్లో చేపల తొట్టి (అక్వేరియం) ఉండడం కూడా ఎంతో మేలు చేస్తుంది. అక్వేరియంలో చేపలు తిరుగుతుంటే మీ ఇంట్లో కూడా సంపద అలాగే తిరుగుతుంది. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్‌ను పెట్టాలి. జేడ్ ప్లాంట్ అయితే బయట పెట్టుకోవచ్చు. ఇది చూసేందుకు అచ్చం గంగవాయిల ఆకును పోలి ఉంటుంది. ఇక మనీ ప్లాంట్‌ను అయితే ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టాలి. దీన్ని నేలకు తగిలేలా పెట్టకూడదు. ఇలా ఈ రెండు మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు సంపద కలసి వస్తుంది. అనుకున్నది నెరవేరుతుంది. ఏం చేసినా విజయం సాధిస్తారు. అలాగే చైనీస్ నాణేలను ఇంట్లో పెట్టుకున్నా మీకు శుభమే కలుగుతుంది. వీటిని కూడా ఫెంగ్ షుయ్ వాస్తులో ముఖ్యంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ పరిహారాలను మీరు పాటించినట్లయితే లక్ కలసి రావడంతోపాటు ఐశ్వర్యవంతులు కూడా అవుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…