Natural Hair Oil : పూర్వకాలంలో మన పెద్దలకు కేవలం వయస్సు పైబడిన తరువాతే జుట్టు తెల్లగా మారేది. అందుకు కారణం వారిలో వయస్సు పెరిగే కొద్దీ మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం తగ్గిపోవడమే. అందువల్లే వయస్సు పైబడే వారిలో జుట్టు తెల్లబడుతుంది. అయితే నేటి కాలంలో చాలా చిన్న వయస్సులో ఉన్నవారు కూడా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వంశపారంపర్యత, హార్మోన్ల లోపం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు తెల్లబడుతోంది. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఆయిల్‌ను నాచురల్‌గా తయారు చేసి వాడితే దాంతో తెల్ల జుట్టు సహజంగా నల్లబడుతుంది. ఇక ఆయిల్‌కు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
మార్కెట్‌లో మనకు జుట్టును నల్ల బరిచేందుకు అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి చాలా ఖరీదు కలవి అయి ఉంటాయి. అలాగే వాటిని రసాయనాలతో తయారు చేస్తారు. కనుక వాటిని దీర్ఘకాలంలో వాడడం అంత శ్రేయస్కరం కాదు. అందువల్ల సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన వాటిని వాడాలి. వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ఒకటి. దీని తయారీకి కరివేపాకులు, నల్ల నువ్వులు, ఉసిరి ముక్కలు, పసుపు, గసగసాలు, వాల్ నట్స్, బాదం పప్పు, ఆవ నూనె అవసరం అవుతాయి. వీటిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి.

స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అందులో ముందుగా ఆవనూనె వేయాలి. నూనె కాగిన తరువాత అందులో మిగిలిన అన్ని పదార్థాలను వేసి నూనె రంగు మారే వరకు మరిగించాలి. అనంతరం నూనెను వడకట్టాలి. దాన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. ఇక ఈ ఆయిల్‌ను వారంలో రెండు సార్లు వాడాలి. తలకు బాగా అప్లై చేశాక 2 గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే మీ జుట్టు నల్లగా మారడమే కాదు, పొడవుగా పెరుగుతుంది. దృఢంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇందులో వాడిన అన్ని పదార్థాలు సహజసిద్ధమైనవే, అందువల్ల మీ జుట్టుకు ఎలాంటి హాని కలగదు. దీంతో మీ జుట్టును చక్కగా సంరక్షించుకోవచ్చు.