Fennel Seeds Water : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటలపాటు నిద్రపోవడంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. తగిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకు గాను యోగా, ధ్యానం చేయాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే ఓ పానీయాన్ని తాగడం వల్ల మీరు ఎంతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దీంతో మీకు అనేక అద్భుతమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ పానీయం ఏంటో తెలుసా.. అదేనండీ.. సోంపు నీళ్లు. సోంపు గింజలను నీళ్లలో వేసి మరిగించి తయారు చేయాలి. ఇందులో అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదా నేరుగా కూడా తాగవచ్చు.
ఇలా తయారు చేసిన సోంపు గింజల నీళ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అనేక లాభాలను పొందవచ్చు. సోంపు గింజల నీళ్లను రోజూ పరగడుపునే తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ నీళ్లను తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. శరీరంలోని వేడి తగ్గుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేడి శరీరం ఉన్నవాళ్లకు ఈ నీళ్లు ఎంతగానో మేలు చేస్తాయి.
ఉదయాన్నే సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇలా ఈ నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…