Mahila Samman Saving Certificate Scheme : కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేసుకునేందుకు మనకు అనేక రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే ఎంత కాలం డబ్బును పొదుపు చేసినా దాని మీద వడ్డీ లేదా ఆదాయం ఎక్కువ రావాలని భావిస్తారు. అయితే వాస్తవానికి బ్యాంకులు అందించే పలు రకాల స్కీముల కన్నా పోస్టాఫీస్ అందించే స్కీములే మనకు అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి. పోస్టాఫీసుల్లో మనకు అన్ని రకాల మనీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మహిళలకు అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్. ఈ పథకం వివరాల గురించి ఇప్పుడు చూద్దాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనేది కేవలం మహిళల కోసమే పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చిన పథకం. దీని కింద మహిళలకు తక్కువ కాలవ్యవధిలోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం కింద డబ్బు పొదుపు చేస్తే మహిళలకు 7.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ కింద డబ్బును కేవలం 2 ఏళ్లపాటు మాత్రమే పొదుపు చేయగలుగుతారు. అది కూడా గరిష్టంగా రూ.2 లక్షలను పొదుపు చేయవచ్చు. ఈ పథకాన్ని 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కింద డబ్బు పొదుపు చేసుకుంటే మహిళలకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అలాగే ఈ పథకం కింద 10 ఏళ్లు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరిట కూడా డబ్బు పొదుపు చేయవచ్చు. ఇక ఈ పథకం కింద ఒక మహిళ గరిష్టంగా రూ.2 లక్షలు పొదుపు చేస్తే మొదటి ఏడాది 7.5 శాతం వడ్డీ చొప్పున రూ.15వేలు చెల్లిస్తారు. రెండో ఏడాదిలో రూ.16,125 ఫిక్స్‌డ్ మొత్తాన్ని వడ్డీ కింద చెల్లిస్తారు. ఈ క్రమంలో 2 ఏళ్లకు కలిపి రూ.2 లక్షలకు మొత్తం రూ.31,125 వడ్డీ కింద చెల్లిస్తారు. దీంతో పథకం ముగుస్తుంది. ఇలా ఈ స్కీమ్‌లో మహిళలు డబ్బు పొదుపు చేసి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…