ఈరోజుల్లో బయట ఫుడ్స్‌ను అసలు నమ్మలేకుండా ఉన్నాము. హోటల్స్‌లో కుళ్లిపోయిన, ఎక్స్‌పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్‌ను జనాలకు వడ్డిస్తున్నారు. అసలు ఏమాత్రం నాణ్యతను పాటించడం లేదు. జనాల ఆరోగ్యం అంటే వ్యాపారులకు లెక్క లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే ఇది కాస్త భిన్నమైన విషయం. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న సెక్టార్ 12 ప్రాంతానికి చెందిన దీపా దేవి తన 5 ఏళ్ల కుమారుడికి మ్యాంగో షేక్ తయారు చేయాలని భావించి ఆన్‌లైన్‌లో అందుకు అవసరం అయిన ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. ఓ ఈ-కామర్స్ డెలివరీ యాప్‌లో ఓ కంపెనీకి చెందిన ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. అయితే ఐస్‌క్రీమ్ డెలివరీ అయ్యాక దాని మూత తెరచి చూస్తే షాకవడం దీపా దేవి వంతైంది. ఎందుకంటే ఐస్‌క్రీమ్ బాక్స్‌లో ఓ కాళ్ల జెర్రి గడ్డకట్టుకుని పోయి కనిపించింది. అది ఐస్‌క్రీమ్ మీదే ఉంది.
దీంతో ఆమెకు వెంటనే వెన్నులో జలదరింపు వచ్చింది. అయితే వెంటనే తేరుకుని ఆ ఐస్‌క్రీమ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఈ సంఘటనపై ఆమె సదరు యాప్‌లో ఫిర్యాదు చేయగా వారు ఆమెకు ఆ ఐస్‌క్రీమ్ ఖరీదు రూ.195 తిరిగి ఇచ్చేశారు. అలాగే సదరు ఐస్‌క్రీమ్ కంపెనీకి సైతం తాము ఫిర్యాదు చేశామని, వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సదరు యాప్ వారు ఆమెకు తెలియజేశారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ విషయం మరోమారు తెరపైకి వచ్చింది. అసలు బయటి ఫుడ్స్‌ను తినాలంటేనే భయపడాల్సి వస్తుందని జనాలంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…