Chanakya Niti : ఆఫీసులన్నాక కొలీగ్‌ల మధ్య రాజకీయాలు సహజం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోసమే ఉద్యోగులందరూ ప్రయత్నిస్తారు. అయితే కేవలం కొందరు మాత్రమే ఇలాంటి ఆఫీస్ రాజకీయాల్లో విజయవంతమవుతారు. కొందరు మాత్రం ఇతర ఉద్యోగులు చేసే జిమ్మిక్కుల్లో పడి వెనకబడతారు. అయితే అలాంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే ఆఫీస్ రాజకీయాల్లో తమదైన ముద్రను వేసి పైకి ఎదగవచ్చట. దీంతో విజయాలు కూడా సొంతమవుతాయట. ఇంతకీ ఆఫీసు రాజకీయాల్లో విజయం కోసం చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటంటే.. అన్ని పాములు విషాన్ని కలిగి ఉండవు. వాటిలో విషం లేనివి కూడా కొన్ని ఉంటాయి. అయితే అవి కూడా విషం ఉన్న పాముల్లాగే ప్రవర్తిస్తాయి. మనుషులు కూడా ఇలాంటి ప్రవృత్తిని అలవాటు చేసుకుంటే ఆఫీసు రాజకీయాల్లో పై చేయిని సాధించవచ్చట.
ఉద్యోగులెవరైనా తమ తమ రహస్యాలను గురించి ఇతరులతో చర్చించకూడదు. వాటిని ఇతరులకు అస్సలు తెలియనీయకూడదు. లేదంటే ఇతరులు వాటితో పై చేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈగో ఉన్న వారితో మర్యాదగా ఉంటూ, తెలివి ఉన్న వారితో ఎల్లప్పటికీ నిజమే చెబుతూ, మూర్ఖులతో ఎప్పటికీ వాదించకుండా ఉంటుంటే వారు మీ పట్ల ఆసక్తి చూపుతారు. విజయం మీ సొంతమవుతుంది. ఎవరైనా ఏదైనా పని చేసే ముందు 3 ప్రశ్నలను మనస్సులో వేసుకోవాలి. అవేమిటంటే, 1. నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను? 2. దీని ఫలితం ఎలా ఉంటుంది? 3. ఇది విజయవంతం అవుతుందా? అనే ప్రశ్నలను వేసుకుంటే, వాటికి సంతృప్తికర సమాధానాలు లభించాయి అనుకుంటేనే అప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలి.
ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి భయ పడకూడదు. మధ్యలో వదిలేయ కూడదు. చివరి వరకు పని చేస్తేనే అలాంటి వారు సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటారు. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట మీ శత్రువులపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం ఎల్లప్పుడూ గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. లేదంటే మనం జీవితంలో ఎక్కువ కాలం మనగలగలేం. ఏ వ్యక్తి అయినా మరీ అత్యంత నిజాయితీ పరుడై ఉండకూడదు. నిటారుగా ఎదిగే చెట్లనే ఎక్కువగా నరుకుతారు కదా. బంగారం ఎంతటి అసహ్యంలో పడినా దాన్ని కడిగి మళ్లీ తీసుకోవాలి. అలాగే ఎంత తక్కువ స్థాయిలో, పేదరికంలో జన్మించినా ప్రతిభ ఉన్న వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి.
యువత శక్తి, మహిళల అందమే ప్రపంచానికి అత్యంత పెద్ద పవర్ లాంటివి. చదువు అనేది ప్రతి మనిషికి అత్యంత ఆవశ్యకం. చదువుకున్న వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. ప్రతి ఒక్క చోట అతనికి గౌరవం దక్కుతుంది. అన్నింటి కన్నా చదువే ముఖ్యమైంది. ప్రతి ఫ్రెండ్‌షిప్ వెనుక ఏదో ఒక వ్యక్తిగత స్వార్థం లేదా ప్రేరణా శక్తి దాగి ఉంటుంది. ఇది నమ్మలేని చేదు నిజం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…