Vastu Tips For Wealth : ఎంత సంపాదించినా డబ్బు నీళ్లలా ఖర్చవుతుందా..? సంపాదన చాలడం లేదా..? డబ్బులు ఉండడం లేదా..? డబ్బు ఎలా వస్తుందో అలాగే ఖర్చవుతోందా..? అయితే మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం పలు సూచనలు పాటిస్తే దాంతో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యవంతులవుతారు. అంతా శుభమే కలుగుతుంది. డబ్బు పోవడం జరగదు, అంతా రావడమే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే అందుకు మీరు పాటించాల్సిన సూచనలు ఏమిటంటే..
ఒక పసుపు రంగు వస్త్రంలో కొంత పసుపు వేసి దాన్ని బాగా ముడి వేసి అనంతరం ఆ మూటను దిండు కింద పెట్టి నిద్రించండి. అంతే.. ఆ తరువాత మీ జీవితంలో కలిగే మార్పులను మీరే గమనిస్తారు. ఇలా చేయడం వల్ల ధనం బాగా కలుగుతుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. ఒక రాగి పాత్రలో నీటిని పోసి ఆ పాత్రను మీరు నిద్రించే బెడ్ కింద పెట్టుకోండి. అలా వీలు కాకపోతే ఆ పాత్రను బెడ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు. దీంతోపాటు ఒక చిన్న ఎర్ర చందనం ముక్కను మీరు నిద్రించే దిండు కింద పెట్టుకుని రాత్రి పూట పడుకోండి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయట. అంతేకాదు, సంపద మిక్కిలిగా వృద్ధి చెందుతుందట.
ఒక వెండి పాత్రలో నీటిని పోసి పైన చెప్పినట్టుగా బెడ్ కింద లేదా పక్కన పెట్టుకోవాలి. లేదంటే వెండితో చేసిన బ్రేస్‌లెట్లు, చెవి రింగులు వంటివి కూడా ధరించవచ్చు. అలా చేస్తే ధనం బాగా సమకూరుతుందట. ఏది అనుకున్నా వెంటనే జరిగిపోతుందట. వెండి లేదా బంగారంతో చేసిన ఆభరణాలను దిండు కింద పెట్టుకుని నిద్రించాలి. లేదంటే ఒక కాంస్య పాత్రలో నీటిని పోసి దాన్ని బెడ్ కింద లేదా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జాతక చక్రంలోని మంగళ దోషం పోతుందట. అంతేకాదు, దీంతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుందట. ఐశ్వర్యవంతులు అవుతారట.
వెండితో చేసిన చేపను బెడ్ కింద పెట్టుకోవాలి. లేదంటే వెండి పాత్రలో కొంత నీటిని పోసి దాన్ని బెడ్ పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం అనుకున్నది జరుగుతుందట. సంపద బాగా వస్తుందట. ఇనుముతో చేసిన పాత్రలో కొంత నీటిని పోసి బెడ్ కింద లేదా పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఒక నీలం రాయిని దిండు కింద పెట్టి నిద్రించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం పోతుందట. అంతా శుభమే కలుగుతుందట. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…