Chanakya Niti : ఆచార్య చాణక్యుడు… భారత సామ్రాజ్య స్థాపనలో ఆయనపాత్ర చాలా కీలకం. ఆచార్య చాణక్యుడుని కౌటిల్య మరియు విష్ణుగుప్త అని కూడా అంటారు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజైన చంద్రగుప్త మౌర్య యొక్క అత్యంత విశ్వసనీయ సలహాదారుడిగా మరియు మంత్రిగా చాణక్యుడు పరిగణించబడ్డాడు. చాణక్యుడు తన శాస్త్రీయ గ్రంథాల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య సూత్రాలను చాలా చక్కగా వివరించాడు. నేటికి ప్రజలు చాణక్యుడి విధానాలను అనుసరిస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇక చాణక్యుడు నరకంలో బాధించబడి ఆ తరువాత భూమిపై జన్మించిన వారిని వారి అలవాట్లను బట్టి మనం చాలా సులభంగా గుర్తించవచ్చని కూడా చెప్పారు.
అలాంటి వ్యక్తులు ఎక్కువగా చెడు అలవాట్లు కూడా కలిగి ఉంటారని కూడా అతను చెప్పాడు. ఇలా నరకంలో బాధింపబడి మరలా భూమిపై జన్మించిన వారిని ఎలా గుర్తించాలి.. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి విధానంలో వ్యక్తి యొక్క గుణాలు, అలవాట్లు, లోపాల గురించి ప్రత్యేక శ్రద్ద చూపించబడింది. అలాగే చాణక్యుడి ప్రకారం చాలా మంది నరకం నుండి వచ్చి భూమిపై జన్మించిన వారే. నరకం యొక్క బాధను అనుభవించి భూమిపై జన్మించిన వారిని వారి లోపాలను బట్టి గుర్తించవచ్చు. వారి మాటలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. అలాగే వారు ఎవరితో కూడా అంత ఎక్కువగా కలిసి ఉండరు. అలాగే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కూడా చక్కగా కలిసి ఉండరు.
వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు కూడా. ఇక చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం ఏడవ అధ్యాయం 16 వ శ్లోకంలో స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి లక్షణాల గురించి కూడా చెప్పబడింది. ఆచార్య చాణక్యుడి ప్రకారం స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి. వారు దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే దేవున్ని కూడా ఎక్కువగా పూజిస్తారు. అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా వారి లక్షణాలను బట్టి వారు స్వరంలో జీవించి మరలా జన్మించారా.. లేదా నరకంలో జీవించి భూమిపై మరలా జన్మించారా అన్న వివరాలను మనం సులభంగా తెలుసుకోవచ్చని చాణక్యుడు తెలియజేసాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…