Money Problems : హిందువులు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తుందని నమ్ముతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలనుకునే వారు శుక్రవారం చేసే పనులతో పాటు చేయకూడని పనులు కూడా ఉంటాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపంవచ్చి ఇంట్లో నుండి వెళ్లిపోతుందని మనం ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మనం లక్ష్మదేవి అసంతృప్తిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు మనం చేయకూడని పనులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు మాంసాహారాన్ని తినడం, మద్యపానం వంటివి చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శుక్రవారం నాడు మద్యపాన సేవనం, మాంసాహారాన్ని తీసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే జోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం నాడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అసభ్యపదజాలాన్ని వాడకూడదు. ఇది మీ ఖజానాను ఖాళీ చేస్తుంది. ఈ రోజున ఇతరులతో గొడవపడడం, తిట్టడం వంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. అదేవిధంగా శుక్రవారం నాడు దానం చేస్తే మంచిదని చాలా మంది నమ్ముతారు.
అయితే పొరపాటున కూడా శుక్రవారం నాడు ఈ వస్తువులను దానం చేయకూడదు. శుక్రవారం నాడు వెండి, పంచదార వంటి వాటిని దానం చేయడం వల్ల శుక్రగ్రహం బలహీనపడుతుంది. అలాగే శుక్రవారం నాడు ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు మరియు ఇతరుల నుండి డబ్బు తీసుకోకూడదు. ఇక శుక్రవారం నాడు వంటగదికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం రాకుండా పోతుంది. అలాగే శుక్రవారం నాడు చిరిగిన మరియు మురికి దుస్తులను ధరించకూడదు. ఇలా చేయడం వల్ల రాహువు బలహీనపడుతుంది. కనుక శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదని ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకతప్పదని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…