ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌నిదేవుడికి నూనెను ఎందుకు స‌మ‌ర్పిస్తారు.. దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

Lord Shani Dev : శ‌నిదేవుడుని న్యాయ దేవుడు, క‌ర్మ దేవుడు మ‌రియు గ్ర‌హాల రాజుగా ప‌రిగ‌ణిస్తారు. తొమ్మిది గ్ర‌హాలల్లో శ‌ని అత్యంత శ‌క్తివంత‌మైన గ్రహంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. అయితే శ‌నిదేవుడి పేరు విన‌గానే ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతారు. ఎందుకంటే శ‌ని దేవుడు క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను ఇస్తాడ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతారు. కానీ శ‌నిదేవుడి శిక్షించ‌డంతో పాటు క‌ర్మ‌ల ఫ‌లాల‌ను కూడా ఇస్తాడు. మీరు మంచి చేస్తే మంచి ఫలితాల‌ను అన‌గా సంతోషాన్ని, ఆనందాన్ని, శ్రేయ‌స్సును ఇస్తాడు. అదే మీరు చెడు ప‌నులు చేస్తే శిక్ష‌లను విధిస్తాడు. శని దేవుడు ఒక న్యాయ‌మూర్తి వ‌లె మ‌న క‌ర్మ ఫ‌లాల‌ను మ‌న‌కు అందిస్తాడు. ఇక శ‌నివారం శ‌నిదేవుడికి అంకింతం చేయ‌బ‌డింది. శ‌నిదేవునికి నూనెను స‌మ‌ర్పించడం వ‌ల్ల మ‌నం కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

శ‌నిదేవుడికి నూనెను స‌మ‌ర్పించిన‌ప్ప‌టికి చాలా మందికి దీని వెనుక ఉండే కార‌ణం తెలియ‌దు. అస‌లు శ‌నిదేవుడికి నూనెను ఎందుకు స‌మ‌ర్పిస్తారు..? దీని వెనుక ఉన్న ప్రాముఖ్య‌త‌, పురాణాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్ర‌కారం హ‌నుమంతుని యొక్క శ‌క్తి సామార్థ్యాల‌ను శ‌ని దేవుడు తెలుసుకున్నాడు. శ‌ని దేవుడికి అత‌ని బ‌లం, శ‌క్తి గురించి ఎప్పుడూ గ‌ర్వ‌ప‌డుతూ ఉండేవాడు. దీంతో శ‌నిదేవుడు హ‌నుమంతుడితో పోరాడ‌డానికి వెళ్లాడు. శ‌నిదేవుడు వెళ్లేస‌రికి హ‌న‌మ‌తుండు ఒక చోట క‌ళ్లు మూసుకుని రామ నామాన్ని జ‌పిస్తూ ఉన్నాడు. కానీ అహంకార మ‌త్తుతో శ‌నిదేవుడు హ‌నుమంతుడిపై యుద్దానికి స‌వాలు చేశాడు. దీంతో హ‌నుమంతుడు శ‌నిదేవుడితో నేను భ‌క్తిలో మునిగి ఉన్నాను ఇప్పుడు యుద్దం చేయ‌డం స‌రికాద‌ని వివ‌రించాడు. అయిన‌ప్ప‌టికి శ‌నిదేవుడు విన‌లేదు. దీంతో హ‌నుమంతుడు కూడా యుద్దానికి సిద్దం అయ్యాడు. యుద్దం జ‌రిగేట‌ప్పుడు హ‌నుమంతుడు శ‌నిదేవుడిని త‌న తోక‌లో చుట్టి రాళ్ల‌పై ప‌దే ప‌దే విసిరాడు.

Lord Shani Dev

దీంతో శ‌నిదేవుడు తీవ్రంగా గాయ‌ప‌డి హ‌నుమంతుడిని క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఇక అప్ప‌టి నుండి హ‌నుమంతుడి భ‌క్తుల‌పై, రాముడి భ‌క్తుల‌పై శ‌నిదేవుడు ఆశీర్వాదాల‌ను కురిపించ‌డంతో పాటు వారిని ఎప్ప‌టికి ఇబ్బందుల‌కు గురి చేయ‌న‌ని చెప్పాడు. యుద్దం ముగిసిన త‌రువాత శ‌నిదేవుడు చాలా బాధ‌కు గురిఅయ్యాడు. ఈ బాధ‌ను చూడలేని హ‌నుమంతుడు శ‌నిదేవుడికి నూనెను ఇచ్చాడు. ఆ నూనెను పూయ‌గానే శ‌నిదేవుడి బాధ త‌గ్గింది. ఇక అప్ప‌టి నుండి శ‌నిదేవుడికి నూనెను నైవేధ్యంగా పెట్ట‌డం ప్రారంభించారు. శ‌నిదేవుడికి నూనెను స‌మర్పించ‌డం వెనుక ఉన్న పురాణా గాధ ఇది.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM