Cat Eyes Syndrome : మనలో చాలా మందికి పుట్టుకతోనే శరీరంలో కొన్ని భాగాలు విభిన్నంగా ఏర్పడుతుంటాయి. అలాగే కొందరికి వయస్సు పెరిగే కొద్దీ వివిధ భాగాల్లో మార్పులు వస్తుంటాయి. ఇక ఇలాంటి వాటిల్లో చెప్పుకోదగినది పిల్లి కళ్లు కూడా ఒకటి. కొందరికి ఇవి పుట్టుకతోనే వస్తాయి. కొందరికి వయస్సు పెరిగిన తరువాత ఏర్పడుతాయి. అయితే చాలా మందికి ఇలాంటి వారిపై ఒక అభిప్రాయం ఉంటుంది. అదేమిటంటే.. పిల్లి కళ్లు ఉన్నవారు మోసం చేస్తారని, వారు మంచి వారు కాదని, వారిని అసలు నమ్మవద్దని భావిస్తుంటారు. అందుకనే పిల్లి కళ్లు ఉన్నవారిని నలుగురిలోనూ ప్రత్యేకంగా కూడా చూస్తుంటారు. అయితే నిజంగానే ఈ కళ్లు ఉండడం అంత మంచిది కాదా, వీరిని నమ్మకూడదా, అసలు సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లి కళ్లు ఉండడాన్ని వైద్య భాషలో క్యాట్ ఐస్ సిండ్రోమ్ అంటారు. అంటే పిల్లి లాంటి కళ్లను కలిగి ఉండడం అన్నమాట. అయితే కొందరికి పుట్టుకతోనే ఇలా వస్తుంది. కొందరికి వయస్సు పెరిగాక ఇలా అవుతుంది. కానీ ఇందుకు వారు ఎంతమాత్రం కారణం కాదు. ఎందుకంటే ఇలా పిల్లి కళ్లను కలిగి ఉండడం అనేది వారి చేతుల్లో ఏమీ ఉండదు. అది వారిలో ఏర్పడే జన్యులోపాలు, క్రోమోజోమ్ సమస్యల వల్ల వస్తుంది. ఇలా చాలా అత్యంత అరుదుగా జరుగుతుంటుంది.
సుమారుగా ఒకటిన్నర లక్షల మందిలో ఒకరికి ఇలా పిల్లి కళ్లు వస్తుంటాయి. అయితే ఇలాంటి కళ్లను కలిగి ఉన్నంత మాత్రాన అందరూ చీట్ చేస్తారని, మోసగిస్తారని కాదు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా వట్టి అపోహే అని వైద్యులు కొట్టి పారేస్తున్నారు. వాస్తవానికి పిల్లి కళ్లు ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కనుక అలాంటి వారు ఇకపై ఎప్పుడైనా కనిపిస్తే వారి పట్ల నెగెటివ్ భావాలను పెట్టుకోకండి. పాజిటివ్‌గా ఉండండి. వారు మోసం చేస్తారని భావించడంలో అసలు అర్థం లేదు. మెసాలు అనేవి మనసుకు చెందినవి. బయటికి ఎంత అందంగా కనిపించినా కొందరు మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. కనుక పిల్లి కళ్లు ఉన్నంత మాత్రాన వారు మెసం చేస్తారని అనుకోకూడదు. వారిలోనూ మంచివారు కూడా ఉంటారు. కనుక ఈ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…