Kali Purushudu : ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. జనాలు చాలా మంది ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాలను కలిగి ఉన్నారు. వీరే మంచివాళ్లుగా, గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు, చేసే వారు ఈ సమాజంలో చాలా తక్కువే. వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అయితే ఇలాంటి వారికి సమాజంలో ఆదరణ ఉండదు. వీరిని కొందరు తొక్కేస్తారు. అయితే ఎప్పటికైనా నీతి నిజాయితీలకే కదా విలువ ఉండేది. కనుక చెడు వ్యసనాలు కలిగి ఉండేవారు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారు ఎప్పటికైనా దారుణంగా చనిపోతారు. ఇక ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైందో, కలి ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశలో పరీక్షిత్ అనే పేరున్న మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది. దాని వద్దకు వెళ్లి చూడగా ఆ ఆవుకు ఒక కాలు ఉండదు. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు కాలును నరికేశారు అని పరీక్షిత్ అడుగుతాడు. అందుకు ఆ ఆవు, తన కాలును కలి తీసివేశాడని చెబుతుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరీక్షిత్తు కలిని పట్టుకుని బంధిస్తాడు. అతన్ని చిత్రవధ చేస్తాడు.
అయితే పరీక్షిత్తు మహారాజు చేస్తున్న హింసకు తట్టుకోలేని కలి తనను ఎందుకు అలా కొడుతున్నావ్ అని అడుగుతాడు. అందుకు తాను చూసింది పరీక్షిత్తు కలికి చెబుతాడు. అప్పుడు కలి ఇది కలియుగం కాబట్టి తాను ప్రవేశించానని తాను ఏమైనా చేస్తానని అంటాడు. కానీ అందుకు పరీక్షిత్తు ఒప్పుకోడు. అప్పుడు కలి తాను ఉండే చోటుకు జనాలను రావద్దని కోరుతాడు. అందుకు పరీక్షిత్తు ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో కలి జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోట్లలో ఉంటాడు.
అందులో భాగంగా జూదశాల నుంచి వచ్చే అసత్యం, మద్యపానం నుంచి వచ్చే మదం, అహంకారం, వ్యభిచారం నుంచి వచ్చే కామము, హింస నుంచి వచ్చే కోపం, క్రౌర్యంలలోనూ కలి చేరుతాడు. దీంతోపాటు నెమ్మదిగా బంగారంలోనూ కలి స్థానం ఆక్రమిస్తాడు. దాన్నుంచి పుట్టే మాత్సర్యంలోకి కూడా కలి చేరుతాడు. దీంతో కలి మొత్తం 9 స్థానాలను ఆక్రమిస్తాడు. ఈ 9 స్థానాల్లో ఉండేవారిని కలి పట్టి పీడిస్తాడని చెబుతాడు. అయితే పరీక్షిత్తు మహారాజు కూడా కలి ప్రభావం వల్ల మరణిస్తాడు. అతను ధరించే బంగారు ఆభరణాల వల్ల మాత్సర్యం పీడితుడై ఓ ముని శాపం బారిన పడి పాము కాటుకు మరణిస్తాడు. అందు వల్ల పైన చెప్పిన ఆ తొమ్మిందిటికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…