Vamu Aaku : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో వాము ఆకు మొక్క కూడా ఒకటి. ఇది చూసేందుకు అంతగా ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఇది అందించే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుకుంటారు. ఈ ఆకులు అచ్చం వాము వాసనను పోలి ఉంటాయి. వాము లాగే ఈ ఆకులు కూడా మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వాము ఆకులను సాధారణంగా చాలా మంది బజ్జీలుగా వేసుకుంటారు. దీంతో రోటి పచ్చడి చేసి తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే వాము ఆకుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోజూ ఒక్క వాము ఆకును తింటే చాలు రక్త నాళాలు క్లీన్ అవుతాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. రోజూ ఒక వాము ఆకును నమిలి తింటే చాలు జీవితంలో అసలు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే హైబీపీ ఉన్నవారు ఈ ఆకును రోజూ ఒకటి తింటే చాలు బీపీ కంట్రోల్ అవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇలా వాము ఆకుతో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
ఇక ఈ ఆకులను తినడం వల్ల ఊపిరితిత్తులు సైతం క్లీన్ అవుతాయి. అలర్జీలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి మేలు జరుగుతుంది. వాము ఆకుల్లో యాంటీ హిస్టామైన్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోజూ ఈ ఆకులను తింటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. ఇక ఈ ఆకులను కాస్త వేడి చేసి కట్టులా కడితే ఎలాంటి నొప్పుల నుంచి అయినా సరే ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటున్నా చాలు ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
వాము ఆకులను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ వాము ఆకులను తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఒక వాము ఆకును తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. వాము ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ఇలా వాము ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు. కనుక రోజూ ఈ ఆకులను తీసుకోవడం మరిచిపోకండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…