Gold Jewellery : సాధారణంగా మనకు రోజూ అనేక రకాల కలలు వస్తుంటాయి. కానీ అన్ని కలలు మనకు గుర్తుండవు. ఉదయం నిద్ర లేవగానే మనం ఆ కలలను మరిచిపోతుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు పీడకలలు కూడా వస్తుంటాయి. కొన్ని కలల్లో మనం వింత పనులు చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ కలలు అనేవి మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను నిర్దేశిస్తాయని చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు కలలో మనకు బంగారం లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇలా ఇవి కలలో కనిపిస్తే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో బంగారం లేదా ఆభరణాలు నేలపై పడినట్లు కనిపిస్తే మీరు ఆర్థికంగా నష్టపోనున్నారని అర్థం. మీకు ఆర్థిక సమస్యలు పొంచి ఉన్నాయని, త్వరలోనే డబ్బు పరంగా సమస్యలు రావచ్చని తెలుసుకోవాలి. ఇలాంటి కల వస్తే డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఇలాంటి కలలు వస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇక కలలో వెండి నగలను బంగారు నగలుగా మార్చుకున్నట్లు వస్తే మీరు చిన్న స్థానం నుంచి పెద్ద స్థానానికి చేరుకోబోతున్నారని అర్థం. అంటే మీ వ్యాపారంలో అయితే మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగంలో అయితే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే విద్యార్థులు అయితే ఉన్నత చదువులు చదవబోతున్నారని అర్థం. ఇలాంటి కలలు వస్తే మరింత కష్టపడాలి. దీంతో జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
కలలో మీరు బంగారం లేదా ఆభరణాలను కొన్నట్లే వస్తే మీకు ఆదాయం పెరగబోతుందని అర్థం. ఇలాంటి కల వస్తే మిక్కిలి అదృష్టవంతులు అన్నమాట. వీరు తలపెట్టే కార్యాలు నెరవేరుతాయి. వ్యాపారం చేస్తే అధికంగా ధనం సంపాదిస్తారు. ఇక కలలో బంగారు ఆభరణాలను ధరించినట్లు వస్తే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు త్వరలోనే అనారోగ్య సమస్యల బారిన పడతారని అర్థం చేసుకోవాలి. బంగారు ఆభరణాలను పోగొట్టుకున్నట్లు కల వస్తే మీరు త్వరలోనే తీవ్రంగా అన్నివిధాలుగా నష్టపోతారని అర్థం. అదే బంగారు ఆభరణాలను బహుమతిగా పొందినట్లు కల వస్తే మీకు త్వరలోనే సంపద అమితంగా వస్తుందని అర్థం. మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా ఈ కలలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…