Black Marks On Tongue : మన శరీరంలోని అనేక అవయవాల్లో నాలుక కూడా ఒకటి. ఇది మనకు రుచిని తెలియజేస్తుంది. దీంతో మనం అనేక రకాల వంటకాల రుచులను ఆస్వాదిస్తాము. అయితే డాక్టర్ల వద్దకు వెళ్లగానే మన నాలుక చూపించమంటారు. ఎందుకంటే నాలుకను చూసి మనకు వచ్చిన అనారోగ్య సమస్య గురించి ఇట్టే చెప్పవచ్చు. అందువల్లే వైద్యులు ముందుగా నాలుక చూపించమంటారు. అయితే వాస్తవానికి నాలుక ఇచ్చే పలు సూచనలను గుర్తించడం ద్వారా మనం కూడా మనకు కలిగిన అనారోగ్య సమస్య ఏమిటో ముందుగానే తెలుసుకోవచ్చు. ఇక నాలుకపై ఎలాంటి సూచనలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుక మీద తెల్లగా ఉంటే మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారని, షుగర్ ఉందని అర్థం. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి లేదా షుగర్ ఉన్నవారికి కూడా నాలుక మీద తెల్లగా ఉంటుంది. ఇలా గనక ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక నాలుక మీద నల్లని మచ్చలు ఉన్నాయంటే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. సాధారణంగా ఇలాంటి మచ్చలు క్యాన్సర్ వల్ల ఏర్పడుతాయి. లేదంటే ధూమపానం చేయడం వల్ల ఏర్పడుతాయి. కనుక ఇలాంటి మచ్చలు వస్తున్నాయంటే అప్రమత్తంగా ఉండాలి. లేదంటే క్యాన్సర్ బారిన పడతారు.
ఇక నోటి సమస్యలు ఉన్నప్పటికీ నాలుక మీద తెల్లని పొర ఏర్పడుతుంది. వీరికి నోటి దుర్వాసన కూడా ఉంటుంది. శరీరంలో బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ఉంటే నాలుక పొరలుగా అయినట్లు కనిపిస్తుంది. నాలుక వాపులకు కూడా గురవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడిన వారి నాలుక పసుపు రంగులో లేదా పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఇలా నాలుకను చూసి మనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే వ్యాధులు మరింత ముదరకుండా చూసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…