Chintha Chiguru Pulihora : పులిహోర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. చింతపండు, మిరియాల పొడి, ఇంగువ వేసి చేసే పులిహోర అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా పలు ఆలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెడుతుంటారు. ఇది మరింత టేస్టీగా ఉంటుంది. అయితే చింత చిగురుతోనూ మనం పులిహోరను తయారు చేయవచ్చు. ఇది ఈ సీజన్‌లో మనకు ఎక్కువగా లభిస్తుంది. కనుక చింత చిగురుతో పులిహోరను తయారు చేసి తింటే జిహ్వ లేచి వస్తుంది. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురు – ఒక కప్పు, పొడి అన్నం – రెండు కప్పులు, వేరుశనగ పప్పు – మూడు పెద్ద చెంచాలు, శనగపప్పు – రెండు పెద్ద చెంచాలు, ఆవాలు – అర టీస్పూన్, మినప పప్పు – పెద్ద టీస్పూన్, పసుపు – కొద్దిగా, కరివేపాకు – నాలుగు రెబ్బలు, ఎండు మిర్చి – 3, నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, ఇంగువ – చిటికెడు.
అన్నం ఉడుకుతున్నప్పుడే ఒక టీస్పూన్ నూనె, చిటికెడు ఉప్పు కలిపి పొడిగా వండి చల్లార్చాలి. అర టీస్పూన్ నూనెలో చింత చిగురును పచ్చి వాసన పోయే వరకు చిన్నమంటపై వేయించి పక్కనుంచాలి. ఇదే కడాయిలో నూనె వేసి ఎండు మిర్చి, వేరుశనగ గింజలు, శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒక్కొక్కటిగా వేగనిచ్చి తాళింపుని చిగురుతోపాటు అన్నంలో కలిపితే చాలు. ఎంతో రుచిగా ఉండే చింతచిగురు పులిహోర రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఆలు టమాటా లాంటి కర్రీలతోనూ కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…