Cabbage Onion Pakoda : పకోడీలు అంటే చాలా మందికి ఇష్టమే. చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలను తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పకోడీలను వెరైటీగా చేసుకునే వారు కూడా ఉంటారు. కానీ క్యాబేజీలను కలిపి పకోడీలను ఎప్పుడైనా చేశారా.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే క్యాబేజీ ఉల్లిపాయ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ పిండి – ఒకటింపావు కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, వంట సోడా – చిటికెడు, ఉప్పు – తగినంత, కారం – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాబేజీ – ఒకటింపావు కప్పు, ఉల్లిపాయ – 1 పెద్దది (సన్నగా పొడుగ్గా కోయాలి), పచ్చి మిర్చి – 2, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు – రెండు (సన్నగా కోయాలి), నూనె – వేయించేందుకు సరిపడా.
ఒక గిన్నెలో క్యాబేజీ తరుగు, ఉల్లిపాయ తరుగు, నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో క్యాబేజీ తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి కలపాలి. అవసరం అనుకుంటే చాలా కొద్దిగా నీళ్లు చల్లుకుని మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ ఉల్లిపాయ పకోడీలు రెడీ అవుతాయి. వీటిని సాయంత్రం సమయంలో ఎంతో వేడిగా ఆస్వాదించవచ్చు. టేస్ట్ అదిరిపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…