యూకో బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కోల్‌కతాలోని యూకో బ్యాంక్ బ్రాంచి వారు ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. బ్యాంకులో ఖాళీగా ఉన్న రెగ్యులర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 68 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు జనవరి 20వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. ఈ పోస్ఉలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సీఏ, ఎఫ్ఆర్ఎం, సీఎఫ్ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://ucobank.com/job-opportunities అనే సైట్‌ను సందర్శించవచ్చు.
మొత్తం పోస్టులు 68 ఉండగా, ఎకనామిస్ట్ (జేఎంజీఎస్-I) పోస్టులు : 2, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్-I) పోస్టులు : 2, సెక్యూరిటీ ఆఫీసర్ (జేఎంజీఎస్-I) పోస్టులు : 8, రిస్క్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II) పోస్టులు : 10, ఐటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II) పోస్టులు : 21, చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-II) పోస్టులు : 25 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 01.11.2024 నాటికి ఎకనామిస్ట్ పోస్టులకు అయితే 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల మధ్య, మిలిగిన పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి.
ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు జేఎంజీఎస్-1 పోస్టులకు అయితే రూ.48వేల నుంచి రూ.85వేల వరకు చెల్లిస్తారు. ఎంఎంజీఎస్ 2 పోస్టులకు రూ.64 వేల నుంచి రూ.93వేల వరకు చెల్లిస్తారు. అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.600 కాగా ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.