టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన తన ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా పెట్టిన ఓ పోస్టు సంచలనం రేకెత్తిస్తోంది. అదేమిటంటే.. కష్టపడి పనిచేసే తత్వం, కోడింగ్ కెపాసిటీ ఉంటే చాలు, తనకు ఎలాంటి డిగ్రీలు అవసరం లేదని, అలాంటి అభ్యర్థులు ఎవరైనా సరే తమకు మెయిల్ చేయవచ్చని చెప్పారు. దీంతో ప్రతిభావంతుల కోసం మరోమారు ఆయన వేట కొనసాగించడం మొదలు పెట్టారని అర్థం అవుతుంది. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌తో చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.
సాధారణంగా కోడింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ పని అనుభవం, డిగ్రీ లేనిదే ఎవరూ జాబ్ ఇవ్వరు. కానీ మస్క్ అందుకు విరుద్ధంగా ప్రతిభావంతుల కోసం చేసిన ఈ ప్రకటనతో అందరూ షాకవుతున్నారు. డిగ్రీలు అవసరం లేకుండానే కేవలం స్కిల్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తుండడంపై చాలా మంది ఆయన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎలాన్ మస్క్ సోషల్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌కు అధినేత అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఓ కొత్త యాప్‌ను రూపొందిస్తున్నామని, దాని కోసమే ఇలా ప్రకటన చేశారని అర్థం అవుతోంది. అయితే మస్క్ చెప్పినట్లుగా మీలో కూడా కోడింగ్ కెపాసిటీ ఉండి డిగ్రీ ఏమీ లేకపోయినా మీరు మెయిల్ చేయండి. లక్ కలసి వస్తే మీకు జాబ్ రావచ్చు. ఇంతకీ మస్క్ చెప్పిన మెయిల్ ఐడీ ఏదంటే.. code@x.com ఈ మెయిల్‌కు మీరు మీ రెజ్యూమ్‌ను పంపించండి. సెలెక్ట్ అయితే ఎంచక్కా జాబ్ లో స్థిరపడొచ్చు.