HPCLలో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.1.20 ల‌క్ష‌లు..

January 15, 2026 9:13 PM

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించేందుకు గాను ఫిబ్ర‌వ‌రి 14ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.hindustanpetroleum.com/documents/pdf/Recruitment_of_Junior_Executive_Officer_2024-25_English_15012025.pdf అనే లింక్‌ను సంద‌ర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవ‌చ్చు. అలాగే https://www.hindustanpetroleum.com/ అనే లింక్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు.

మొత్తం 234 పోస్టులు ఉండ‌గా వాటిల్లో.. మెకానిక‌ల్ 130, ఎల‌క్ట్రిక‌ల్ 65, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ 36, కెమిక‌ల్ పోస్టులు 2 ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పూర్తి చేసి ఉండాలి. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 14.02.2025 నాటికి 18 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది.

HPCL Junior Executive Recruitment 2025 full details

అభ్య‌ర్థులు రూ.1180 ద‌ర‌ఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులు చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారు కంపెనీ నియమాల ప్రకారం ఆఫీసర్ గా నిర్ణయించబడతారు. పే స్కేల్‌ రూ.30వేల నుండి రూ.1,20,000 మధ్య ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now