కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడమలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల శక్తి డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల నిస్తేజమవుతుంది. ప్రధానంగా పొత్తి కడుపు, వెన్నెముక కండరాలపై ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది.
డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల శరీరంలోని పై భాగంలో ఉండే కండరాలు తమ సహజమైన వంగే గుణాన్ని కోల్పోతాయి. దీని వల్ల శరీరం ఒకే పొజిషన్‌కు పరిమితమై ఎల్లప్పుడూ టైట్‌గా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. పిల్లలు పెద్ద వారైన తరువాత భవిష్యత్‌లో ఎక్కువ బరువున్న వస్తువులను మోయలేరు. అంతేకాదు శరీరాన్ని, బరువును బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరమవుతుంది.
డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల కండరాలు, నడుం, మోకాళ్లు, మడమలు గట్టిపడి టైట్‌గా ఉండిపోతాయి. ఇది భవిష్యత్తులో కాళ్లు, వెన్ను నొప్పులకు దారి తీస్తుంది. ఇవే కాదు కాళ్లను ఒకదాని ఒకటి వేసి కూర్చోవడం (క్రాస్ లెగ్ సిట్టింగ్), ఒక పక్కగా కూర్చోవడం (సైడ్ సిట్టింగ్), ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా పిల్లల కండరాలు వంగే గుణాన్ని కోల్పోతాయి. కనుక ఆయా భంగిమల్లో చిన్నారులను అసలు కూర్చోనివ్వకూడదు. లేదంటే ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…