Eyebrows : అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఇందు కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలను వాడడం, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం నేటి తరుణంలో ఎక్కువైంది. అయితే ప్రధానంగా ముఖం అందంగా కనిపించాలంటే ఆ భాగంలోని ప్రతి ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా కనుబొమ్మల (ఐబ్రోస్)ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే అమ్మాయిలు తమ ఐబ్రోస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కనుబొమ్మల పొడవును ఎక్కువగా పెంచరాదు. ఏదైనా ఒక పాయింట్ ఆధారంగా కనుబొమ్మలను ఆర్చ్(వంకర)లాగా మలచకూడదు. ఇది ముఖానికి కోపోద్రిక్తమైన లుక్‌నిస్తుంది. కనుబొమ్మలు ఎప్పుడూ ఏదైనా ఒక ఫ్రేమ్‌లో ఇమిడిపోయే విధంగా చక్కని ఆకృతిని కలిగి ఉండాలి. కనుబొమ్మలు ఎక్కువగా హైలైట్ అయ్యేలా మేకప్ షేడ్స్, రంగులను వాడకూడదు. ఇవి డల్ లుక్‌నిస్తాయి. డార్క్ కలర్స్‌తో కనిపించే విధంగా కనుబొమ్మలను తీర్చిదిద్దకూడదు.
పలుచగా ఉన్న ప్రదేశాన్ని ఫిల్ చేయడం కోసం పెన్సిల్ మస్కరా లేదా బ్రో పౌడర్‌ను వాడాలి. సహజంగా ఆర్క్‌లు వచ్చేలా పెన్సిల్‌తో కనుబొమ్మలను తీర్చిదిద్దాలి. కనుబొమ్మలను తరచూ బ్రష్‌తో దువ్వినట్టు చేయాలి. ఇది కనుబొమ్మల వెంట్రుకలను మరింత పెరిగేలా చేస్తుంది. దీంతో కనుబొమ్మలు చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆకర్షణీయమైన లుక్ సొంతమవుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…